దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి మీడియాతో ముచ్చటించింది.
అది నా అదృష్టం
మీనాక్షి మాట్లాడుతూ.. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు చేసిన చివరి చిత్రమిది. ఇదులో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అమేజింగ్ ఎక్స్ పీరియన్స్. ఈ చిత్రంలో నాది మోడ్రన్ గర్ల్ క్యారెక్టర్. ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది నా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుంది.
ఓ కొత్త అనుభూతి
డైరెక్టర్ వెంకట్ ప్రభుతో పని చేయడం ఓ కొత్త అనుభూతి. లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ వంటి మంచి సినిమాల్లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాను. కథ నచ్చిన తర్వాతే నా క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతాను.
సినిమాల సంగతులు
కొత్త సినిమాల విషయానికొస్తే.. వరుణ్ తేజ్‌తో కలిసి మట్కాలో నటిస్తున్నాను. మొకానిక్ రాకీలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. లక్కీ భాస్కర్ లో తల్లి పాత్రలో నటించాను. అనిల్ రావిపూడి సినిమాలో పోలీస్‌గా నటిస్తున్నాను. ఇవన్నీ దేనికవే స్పెషల్ గా ఉంటాయని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment