ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి భేటీపై నాగార్జున అక్కినేని స్పందించారు. రెండు రోజుల క్రితం చిరు ఏపీ సీఎం జగన్‌తో సినీ పరిశ్రమ సమస్యలపై సమావేశమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగార్రాజు మూవీ సక్సస్ మీట్‌లో పాల్గొన్న నాగార్జున సీఎం జగన్-చిరు భేటీపై మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చదవండి: తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
కాగా నిన్న(జనవరి 14) సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌వైపు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీంతో పాటు నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగార్జున సీఎం వైఎస్ జగన్, చిరంజీవి భేటీపై హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు చిరంజీవి వెళ్లారంటే తప్పకుండా హ్యాపీ ఎండింగ్ వస్తుందని నాగ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment