
Nandamuri Balakrishna Increased Remuneration After Akhanda: నందమూరి నటసింహం బాలకృష్ణ తన నటవిశ్వరూపాన్ని చూపించిన మరో సినిమా 'అఖండ'. ఈ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు బాలకృష్ణ. ఒకవైపు హీరోగా తానేంటో ఇప్పటికే చూపించిన బాలకృష్ణ హోస్ట్‌గా కూడా అదరగొడుతున్నాడు. ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు వ్యాఖ్యతగా చేస్తూ తాను ఏ పాత్రనైనా రఫ్పాడిస్తానంటూ జోష్ మీద ఉన్నాడు. అయితే ఈ షోకు బాలకృష్ణ తీసుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకు ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ. 40 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం 12 ఎపిసోడ్‌లకు గాను రూ. 5 నుంచి 6 కోట్ల వరకు బాలకృష్ణ వెనకేయనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా బాలకృష్ణ తన తదుపరి సినిమాకు తీసుకునే పారితోషికం కూడా టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. బాలకృష్ణ ఇటీవలి చిత్రం అఖండకు రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమా హిట్‌తో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు బాలయ్య. ఈ మూవీకి సుమారు రూ. 15 నుంచి 20 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడట బాలకృష్ణ. ఈ సినిమాతో పాటు బాలయ్య మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అయితే బాలకృష్ణ యాక్టింగ్, స్టార్‌డమ్, బిజినెస్‌ను దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట నిర్మాతలు. ఈ నాలుగు సినిమాలన్ని ఓకే అయి పట్టాలకెక్కితే బాలకృష్ణ సుమారు రూ. 50 కోట్లు అందుకోనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కన్నడ హీరో.. ఇట్స్ అఫిషియల్
Comments
Please login to add a commentAdd a comment