Tuck Jagadish Movie Updates: Nani Unveils First single From Tuck Jagadish - Sakshi
Sakshi News home page

Nani-Tuck Jagadish: ‘టక్‌ జగదీష్‌’ నుంచి నాని ఫస్ట్‌ సింగిల్‌

Published Sat, Sep 4 2021 9:06 AM | Last Updated on Sat, Sep 4 2021 10:26 AM

Nani Unveils First single From Tuck Jagadish - Sakshi

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమా సెప్టెంబర్‌ 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ నుంచి ఓ స్పెషల్‌ సాంగ్‌ విడుదలైంది. ‘సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు. నువ్వు గిల్లి గిచ్చి రెచ్చగొడితే వచ్చి దంచుతాడు’ అంటూ సాగే ఈ పాటను నాని కోసం స్పెషల్‌గా ట్యూన్‌ కట్టించాడట దర్శకుడు.

చదవండి: అలా అయితే నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటా.. నాని సంచలన వ్యాఖ్యలు

ఈ పాట ద్వారా ‘టక్‌ జగదీష్‌’ గుణగణాల్ని వర్ణిస్తున్నాడు శివ నిర్వాణ. అంతేగాక ఈ పాటను శివ నిర్వాణ స్వయంగా రాసి పాడటం విశేషం. కాగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తండ్రి ఆశయాన్ని నెరవేర్చే తనయుడిగా నాని కనిపించనున్నాడు. ఇక ఆయన అన్నయ్య పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు నటించాడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికులుగా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement