Tuck Jagadish: ఆ పరిస్థితి లేదు.. అందుకే ఓటీటీకి వెళ్లాం | Sahu Garapati Comments On Tuck jagadish Movie | Sakshi
Sakshi News home page

Tuck Jagadish: మా ప్రయార్టీ ఎప్పుడూ కూడా థియేటర్లే..అందుకే ఓటీటీకి వెళ్లాం

Published Sat, Sep 4 2021 6:12 PM | Last Updated on Sat, Sep 4 2021 6:12 PM

Sahu Garapati Comments On Tuck jagadish Movie - Sakshi

థియేటర్ కోసమే టక్‌జగదీష్‌ సినిమాను ప్లాన్ చేశాం. ఏప్రిల్‌లో విడుదల చేద్దామంటే కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. త్వరలోనే థర్డ్ వేవ్ అంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిలో సినిమాను జనాలకు వరకు తీసుకొస్తామా? లేదా? ఇంకెప్పుడు చూపిస్తామని అందరం కలిసి ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం’అన్నారు నిర్మాత సాహు గారపాటి. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా నిర్మాత సాహు గార‌పాటి మీడియాతో ముచ్చటించారు. 

మజిలీ తరువాత ఈ చిత్రం మొదలైంది. మజిలీ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే  ఎమోషన్స్ తీశాం. ఇంకాస్త పెద్ద స్కేల్‌లో ఎమోషన్స్ ఉండాలని అనుకున్నాం. శివ గారు టక్ జగదీష్ కథ చెప్పారు. ఈ కథకు మంచి యాక్టర్ కావాలని అనుకున్నాం.. అప్పుడు మాకు నాని గుర్తుకు వచ్చారు. మా బ్యానర్ ప్రారంభమైంది కూడా ఆయనతోనే. ఆయనకు టక్ జగదీష్ కథ చెప్పాం.. నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. ఇప్పటి వరకు ఆయన పోషించని పాత్ర ఇది.

 ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలని అనుకునేలా టక్ జగదీష్ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్ మీదే ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలు తక్కువయ్యాయి. అందుకే మేం ఇలాంటి కథతో వచ్చాం. ప్రేక్షకులందరూ మంచి సినిమా చూశామని అనుకుంటారు. సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు. ద్వితీయార్థం మొత్తం కూడా ఎమోషన్స్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. 

ఇది ఫ్యామిలీ ఎమోషన్ సినిమా. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కానీ అది చాలా తక్కువ. అక్కా తమ్ముడు, అమ్మ కొడుకు ఇలా అందరి మధ్య ఎమోషన్స్ ఉంటుంది. కంటెంట్ ఎక్కడా దారి తప్పకుండా ఉండేందుకు ఎంటర్టైన్మెంట్ అంతగా జొప్పించలేదు. కానీ కథకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది.

ఇది భారీ బడ్జెట్ చిత్రం. ఈ లెక్కన అన్ని చోట్లా థియేటర్లు తెరిచి ఉండాలి. కానీ పరిస్థితులు అలా లేనందుకే ఓటీటీకి వెళ్లాం. ఎస్ఆర్ కళ్యాణ మండపం రిజల్ట్ వల్ల మా అభిప్రాయం మారలేదు. ఆగస్ట్‌లో మేం థియేటర్‌కు రావాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు చక్కబడే అవకాశం ఉన్నట్టు మాకు కనిపించలేదు. అందుకే ఓటీటీ నిర్ణయాన్ని తీసుకున్నాం.

 హీరోలైనా, నిర్మాతలైనా ఎవ్వరైనా సరే.. సినిమాను జనాలకు చూపించాలనే అనుకుంటారు. ఇది జనాలకు పండుగ నాడు చూపించాల్సిన సినిమా.

ప్రస్తుతం ఎక్కడా కూడా పరిస్థితులు చక్కబడలేదు. మన పక్క రాష్ట్రాల్లో కూడా ఇంకా అంతగా థియేటర్లు తెరవలేదు. విదేశాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. అందుకే ఎక్కువ మందికి ఈ సినిమాను రీచ్ అయ్యేలా చేసేందుకు ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది.

రెండు మూడు నెలల్లో అన్ని పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం, ఆశ ఉంది. ఆ నమ్మకం ఉంటేనే బతకగలుగుతాం. మిగతా సినిమాలను కూడా రెడీ చేస్తున్నాం. 

అందరు హీరోలతో కలిసి పని చేయాలని అనుకుంటాం. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అని కాకుండా అందరితో చేయాలని అనుకుంటాం. అనిల్ రావిపూడి బాలయ్య ప్రాజెక్ట్‌ను దసరాకు ప్రకటిస్తాం. నాగ చైతన్యతో కూడా ఓ సినిమా ఉంది. విజయ్ దేవరకొండ బిజీగా ఉండటంతో సినిమా కుదరడం లేదు ఇంకా కొంచెం సమయం పడుతుంది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ చేయాల్సిందే. కానీ శివ, గోపీ సుందర్ మధ్య మంచి ర్యాపో ఉంది. మజిలీ, నిన్ను కోరి సినిమాలకు గోపీ సుందర్ సంగీతం అందించారు. కాబట్టి గోపీ సుందర్ నుంచి ఇంకా బాగా తీసుకోగలను అనే నమ్మకంతో శివ నిర్వాణ ఉన్నారు. అందుకే అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాలు చూడడానికి వేరే కొత్త మీడియమ్స్ వచ్చాయి. థియేటర్లు కూడా ఉంటాయి. మా ప్రయార్టీ ఎప్పుడూ కూడా థియేటర్లే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement