National Pet Day 2023: Ram Charan and His Pet Dog Rhyme Pics Goes Viral - Sakshi
Sakshi News home page

National Pet Day: ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్న రామ్‌చరణ్‌ - రైమ్‌.. ఫోటోలు వైరల్‌

Published Tue, Apr 11 2023 7:46 PM | Last Updated on Tue, Apr 11 2023 8:56 PM

National Pet Day 2023: Ram Charan and His Pet Dog Rhyme Pics Goes Viral  - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు పెట్ డాగ్‌ రైమ్‌ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. . రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన ఎప్పుడూ రైమ్‌ మీద ప్రేమ‌ను చూపిస్తూనే ఉంటారు. రైమ్‌ లేకుంటే అడుగుతీసి అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడరు ఈ స్టార్‌ దంపతులు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా వారి వెంట రైమ్‌ ఉండాల్సిందే. హైదరాబాద్‌లో ఇంట్లో ఉన్నా పక్కన రైమ్‌ ఉండాల్సిందే.

రైమ్‌ పేరు మీద ఏకంగా ఒక ఇన్‌స్టా అకౌంటే క్రియేట్‌ చేశారు.  దాదాపు 50 వేల ఫాలోయర్స్‌ రైమ్‌కు ఉండ‌టం విశేషం. ఇక నేషనల్‌ పెట్‌ డే సందర్భంగా రైమ్‌ మీద నెటిజ‌న్స్ స్పెషల్‌ ఫోకస్‌పెట్టారు. రామ్‌ చరణ్‌, రైమ్‌ కలిసి ఉన్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్ల టూర్లలోనూ రైమ్‌ సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ కోసం ఇతర నగరాలకు వెళ్లిన రామ్‌ చరణ్‌..తిరిగి వచ్చే క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రైమ్‌ ఎదురెళ్లి రామ్ వెల్‌క‌మ్ చెప్పి త‌న‌ ఆనందాన్ని, సంబరాన్ని చూపించింది. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్‌ అయింది.  రామ్‌ - రైమ్‌ ఇద్దరి మధ్య బాండింగ్‌ అభిమానులకు, ఫాలోవ‌ర్స్‌కు స్ఫెష‌ల్‌గా అనిపించింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement