
Natural Star Nani: హీరో నాని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు.
ఇలా వరుస సినిమాలతో టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న నానికి బాలీవుడ్ కూడా మూవీ చేయాలని ఉందట. కానీ, ఒకే ఒక కారణం చేత ఆయన బాలీవుడ్‌కి వెళ్లలేకపోతున్నాడట. హిందీ భాష రాకపోవడమే బాలీవుడ్ ఎంట్రీకి అడ్డంకిగా మారిందట.
‘నేను హిందీ మాట్లాడగలను కానీ, బాలీవుడ్ సినిమా చేసేందుకు నాకొచ్చిన హిందీ సరిపోదు. హిందీ సినిమా చేయాలంటే కథ నాకు బాగా నచ్చి, ఆ పాత్ర కోసం కష్టపడి హిందీపై పట్టు సాధించాలని నాకు అనిపించాలి. నాని బాలీవుడ్‌కి కొత్త అనే ఫీలింగ్ ప్రేక్షకులకు రాకుడదు. అలాంటి ప్రాజెక్ట్ వస్తే కచ్చితంగా బాలీవుడ్ సినిమా చేస్తా’ అని తన మనసులోని మాటను బయటపెట్టాడు నాని. కాగా, నాని నటించిన ‘వి’ సినిమా హిందీలోకి కూడా డబ్ అవ్వబోతోంది. ఈ సినిమాకొచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాని, తన బాలీవుడ్ ఎంట్రీపై ఆలోచిస్తాడేమో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment