కోలీవుడ్ స్టార్ అజిత్ రూటే సెపరేటు. తాను తన పని మినహా ఏ ఇతర విషయాలను పట్టించుకోరు. షూటింగ్ లేకపోతే తనకు ఇష్టమైన బైక్ రేసింగ్, రైఫిల్ షూటింగ్ వంటి విషయాలపై దృష్టి సారిస్తారు. ఈయన సినిమాకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనరు. తన చిత్రాల ప్రచార కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటారు. ఈ విషయం గురించి నిర్మాతలకు ముందుగానే చెబుతారు. అదీ అజిత్ పాలసీ. అందుకు సమ్మతించే ఆయనతో చిత్రాలు చేస్తుంటారు.
ప్రమోషన్స్‌కు నయన్ దూరం
హీరోయిన్ నయనతార రూటు కూడా దాదాపు ఇంతే. మొదట్లో చిత్ర ప్రచార వేడుకల్లో పాల్గొన్న ఈమె నటిగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వాటికి దూరంగా ఉంటోంది. తన భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించే చిత్రాలకు, తన సంస్థలో నిర్మించే చిత్రాలకు మాత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ విధానం నిర్మాతలకు నచ్చకపోయినా ఆమెకున్న క్రేజ్ కారణంగా మౌనంగా ఉంటున్నారు. ఇకపోతే నయనతార తన తాజా చిత్రం జవాన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈమె నటించిన తొలి హిందీ చిత్రం జవాన్.
షారుక్ కోసం రూల్ బ్రేక్
ఇందులో కథానాయకుడిగా షారూక్ ఖాన్ నటించాడు. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా, యోగి బాబు కీలకపాత్రలో నటించారు. యువ సంగీత కెరటం అనిరుద్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల మధ్య జవాన్ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో నయనతార పాల్గొననున్నట్లు సమాచారం. షారుక్ ఖాన్ తన అభిమాన నటుడు అని, అందుకే ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నయనతార సిద్ధమైనట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. మొత్తం మీద షారూక్ ఖాన్ కోసం నయనతార తన పాలసీని బ్రేక్ చేస్తుందన్న మాట!
చదవండి: OMG 2: అక్షయ్ కుమార్ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment