
లేడీ సూపర్ స్టార్ నయన తార, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి ఇటీవలే గోవా టూర్ వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా నిండా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట బయట టెన్షన్‌లన్నీ పక్కనపెట్టి ఏకాంతాన్ని ఆస్వాదించారు. సెప్టెంబర్ 18న విఘ్నేష్ 35వ పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. దీనికి మూడు రోజుల ముందు అతడి తల్లి పుట్టినరోజునూ సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేశాయి. అయితే ప్రియుడి బర్త్‌డే కోసం నయన్ భారీగా ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: పూజలు.. ప్రమాణాలు!)
కోలీవుడ్ సినీ వర్గాల ప్రకారం ఈ ప్రేమపక్షులు మూడు రోజులు పాటు గోవాలో ఉండగా.. అందుకోసం నయన్ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. కాగా 'నానుమ్ రౌడీదాన్' సినిమా సమయంలో నయన్, విఘ్నేష్‌లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో విహారయాత్రలు ప్లాన్ చేస్తూ పనిలో పనిగా పలు దేశాలు కూడా చుట్టొచ్చేశారు. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నయనతార నటిస్తున్న "నెట్రికన్" అనే సినిమాను విఘ్నేష్ నిర్మిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న "కాదువాక్కుల రెండు కాదల్" చిత్రంలో నయన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. (చదవండి: నయనతార పచ్చబొట్టు మారింది)
Comments
Please login to add a commentAdd a comment