
కోలీవుడ్‌లో తాజాగా ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నయనతార నటించబోతున్నారన్నదే ఆ వార్త. దక్షిణాదిలో దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్టైలిష్ దర్శకత్వంలో పేరు గాంచిన 2001లో మిన్నలే (చెలి) అనే చిత్రం ద్వారా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో గౌతమ్‌మీనన్‌కు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా సూర్య కథానాయకుడిగా కాక్క కాక్క (ఘర్షణ), కమలహాసన్ హీరోగా వేట్టైయాడు వంటి పలు హిట్ చిత్రాలను తెరకెక్కించారు.
తెలుగులో ఈయన దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'ఏ మాయ చేశావే' చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా నటి సమంత కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. కాగా ఈయన దర్శకుడిగా కొనసాగుతూనే నటుడిగాను ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో వైవిధ్య భరిత కథాపాత్రలను పోషిస్తున్నారు. గౌతమ్‌మీనన్ చివరగా దర్శకత్వం వహించిన చిత్రం వెందు తనిందది కాడు. శింబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా విక్రమ్ కథానాయకుడిగా ఈయన దర్శకత్వం వహించిన ధృవనక్షత్రం విడుదల కావాల్సి ఉంది. చిన్న గ్యాప్ తరువాత గౌతమ్‌మీనన్ మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం.

ఇందులో లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఈ క్రేజీ చిత్రంలో మలయాల సూపర్‌స్టార్ మమ్మట్టి నటించనున్నారని టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఇది తమిళ చిత్రమా? లేక మలయాళ చిత్రమా, అది కాకుండా పాన్ ఇండియా చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది. కాగా నయనతార, మమ్ముట్టి కలిసి 2016లో పుదియ నియమం అనే మలయాళ చిత్రంలో నటించారన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment