
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. NBK 108 వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకులు భారీ అంచనాలను పెంచుకున్నారు. మాస్ హీరో బాలయ్యతో కామెడీ డైరెక్టర్ అనిల్ ఎలాంటి నేపథ్యం ఉన్న సినిమాను తీయబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అంతేకాదు.. ఈ సినిమా స్టోరీ ఇదే.. ఇందులో హీరో చెల్లిగా పలానా హీరోయిన్ నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టాడు అనిల్ రావిపూడి. బాలకృష్ణతో తీయబోయే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశాడు.
(చదవండి: బింధుమాధవి పెళ్లిపై ఆమె తండ్రి ఏమన్నాడంటే..)
ఎఫ్3 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ సినిమా కోసం అందరితో పాటు నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కామెడీని పక్కన పెట్టి తెరపై బాలయ్యను కొత్తగా చూపించబోతున్నా. నా మార్క్ కామెడీ సీన్స్ ఉంటాయి కానీ.. పూర్తిస్థాయి కామెడీ అయితే ఈ చిత్రంలో ఉండదు. ఇందులో బాలయ్య 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడు. ఆయన కూతురిగా శ్రీలీల నటిస్తుంది. పోకిరి, అర్జున్‌రెడ్డి, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలను చూస్తే.. హీరో పాత్ర సినిమాను నడిపిస్తుంది. ఆ టెంప్లేట్‌లో సినిమా చేద్దామని ప్రయత్నిస్తున్నా. ఆ తరహా పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు’అని అనిల్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడి చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 చిత్రం మే 27న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment