కిరణ్ అబ్బవరం, పవన్ కల్యాణ్, కోడి దివ్య దీప్తి, సంజన, శ్రీధర్ గాదె
కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ జంటగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్‌టైన్ మెంట్స్‌పై కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో పవన్ కల్యాణ్ విడుదల చేసి, యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో కిరణ్ క్యాబ్ డ్రైవర్‌గా మాస్ లుక్‌లో కనిపించనున్నారు. అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: రాజ్ కె. నల్లి, సహనిర్మాత: నరేష్ రెడ్డి మూలే.
Comments
Please login to add a commentAdd a comment