Nia Sharma Says She Dont Like Calling Her As Hot Pretty: ప్రముఖ బుల్లితెర హీరోయిన్ నియా శర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. తాను ఇన్‌స్టాలో పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలతో అనేకసార్లు ట్రోలింగ్ బారిన పడింది నియా. నెట్టింట బోల్డ్ ఫొటోలతో అలరించే నియాను ఇన్‌స్టా గ్రామ్‌లో సుమారు 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా నియా 'నాగిన్' అనే హిందీ సీరియల్‌తో తెగ పాపులర్ అయింది. స్పెషల్ సాంగ్స్, సినిమాలతో నటిగా మంచి గుర్తింపు కూడా పొందింది. 2006లో బుల్లితెరకు పరిచయమైన నియాకు 2016లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తొలిసారిగా ఓ మ్యాగజైన్ ప్రచురించిన ఆసియాస్ సెక్సీయస్ట్ వుమెన్ జాబితాలో నిలిచింది నియా. అలా ఒకసారి కాకుండా పలుమార్లు ఆ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
(చదవండి: 'స్టార్ కిడ్స్‌కు అంత సీన్ లేదు..వాళ్లకంటే నేను 100%బెటర్')
తన 30 ఏళ్ల అందంతో అభిమానులను అలరించే నియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను ఎవరైనా హాట్, ప్రెట్టీ అని పిలిస్తే నచ్చదట. 'కొన్నిసార్లు మిమ్మల్ని అభినందిస్తున్న వ్యక్తి నుంచి కేవలం కృతజ్ఞతలు మాత్రమే ఊహిస్తారు. కానీ ఎందుకో.. నేను అలా చేయలేకపోతున్నాను. అలాంటి వాటిని జీర్ణించుకోలేకపోతున్నాను. కొంతమంది నాకు చెప్తుంటారు. నియా నువ్వు చాలా ప్రిట్టీగా కనిపిస్తున్నావ్. చాలా హాట్‌గా ఉన్నావ్. వారు అలా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాదు. వారు ఎందుకు నా గురించి అలా ఆలోచిస్తున్నారు అని అనుకుంటూ అంటాను. నేను అలాంటి అమ్మాయిని కాను. నేను హాట్‌గా కూడా ఉండను. నేను అందరిలానే సాధారణ అమ్మాయిని. ఆధునికంగా ఉండాలనుకుంటాను అంతే. నేను పొగడ్తల కోసం వెంపర్లాడను. అది నా ఎజెండా కాదు. అలా పిలవడం నాకు నచ్చదు.' అని చెప్పింది నియా శర్మ.
(చదవండి: ట్రోఫీని సొంతం చేసుకున్న నియా శర్మ)
Comments
Please login to add a commentAdd a comment