Committee Kurrollu Trailer: ఇలాంటి 'కమిటీ కుర్రోళ్ళు' ప్రతి గ్రామంలో ఉంటారు (ట్రైలర్‌) | Niharika Konidela Committee Kurrollu Movie Official Trailer Out Now, Trailer Highlights Inside | Sakshi
Sakshi News home page

Committee Kurrollu Movie Trailer: ఇలాంటి 'కమిటీ కుర్రోళ్ళు' ప్రతి గ్రామంలో ఉంటారు (ట్రైలర్‌)

Published Fri, Jul 26 2024 2:25 PM | Last Updated on Fri, Jul 26 2024 3:40 PM

Niharika Konidela Committee Kurrollu Trailer Out Now

నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్‌.ఎల్‌.పి, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌లో వచ్చే ఫ్రెండ్‌షిప్‌ వీక్‌లో విడుదలకు సిద్ధమైంది. అయితే, తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. యువతను ఆకట్టుకోవడంతో పాటు వారిని ఆలోచించేలా ట్రైలర్‌ ఉంది.

ఈ చిత్రం ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్త నటులు కనిపించినా వారు నటించిన తీరు చూస్తే ప్రేక్షకులు ఫిదా అవుతారు. ట్రైలర్‌లో ఎక్కువగా స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ, పల్లెటూరిలోని రాజకీయాలు, యువత పడే సంఘర్షణలన్నింటినీ చక్కగా చూపించారు. ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి గ్రామంలో ఇలాంటి  ‘కమిటీ కుర్రోళ్ళు’ తప్పకుండా ఉంటారు అనేలా ట్రైలర్‌ ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement