
నిఖిల్
‘అర్జున్ సురవరం’ విజయంతో నిఖిల్ మంచి స్పీడు మీదున్నారు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ–2’ చిత్రాన్ని, సూర్యప్రతాప్ దర్శకత్వంలో ‘18 పేజెస్’ చిత్రాలను ఇప్పటికే చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా తన 20వ చిత్రాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర ఎల్‌ఎల్‌పి సినిమాస్ పతాకంపై సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు. రెయిన్‌బో రీల్స్ నిర్వహణలో ఈ చిత్రం రూపొందనుంది. నిఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నామని, దర్శకుడు, మిగిలిన నటీనటుల వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment