రాబరీ నేపథ్యంలో ‘1134’ | No budget Experimental Film 1134 Release Date Out | Sakshi
Sakshi News home page

 రాబరీ నేపథ్యంలో ‘1134’

Published Tue, Jan 2 2024 6:06 PM | Last Updated on Tue, Jan 2 2024 6:06 PM

No budget Experimental Film 1134 Release Date Out - Sakshi

కాన్సెప్ట్ ఓరియెంటెడ్, డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో కొత్త దర్శకులు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అలాంటి డిఫరెంట్ మూవీస్‌కు థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ సైతం రొటీన్ ఫార్మూలాను తెరపై చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. అందుకే ఇలాంటి సమయంలో రాబోతోన్న ఓ డిఫరెంట్ ప్రయోగమే  ‘1134’. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా సాగే ఈ సినిమాను నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి తెరకెక్కించారు. శాన్వీ మీడియా బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

(చదవండి:  తీన్మార్‌ మల్లన్న సినిమాలో నటించాడా? కామెడీ సీన్‌ వైరల్‌!)

రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా బ్యానర్‌‌లపై తెరకెక్కిన ఈ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందించారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement