నన్ను పెళ్లి చేసుకుంటావా?: విజయ్‌ సేతుపతి | O Manchi Roju Chusi Chepta Movie Trailer Released | Sakshi
Sakshi News home page

ఓ మంచి రోజు చూసి చెప్తా ట్రైలర్‌ వచ్చేసింది..‌

Published Thu, Mar 25 2021 12:43 PM | Last Updated on Fri, Apr 2 2021 9:00 PM

O Manchi Roju Chusi Chepta Movie Trailer Released - Sakshi

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై హిట్‌ కొట్టిన తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్". ఈ చిత్రం తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే టైటిల్‌తో విడుదల అవుతోంది. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అయింది. 

ఇందులో విజయ్‌ దొంగతనాలు చేసే యముడిగా వేషం కట్టాడు. అతడిని నిహారిక మామయ్య అని పిలుస్తుంటుంది. ఈ క్రమంలో ఓసారి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అతడు నోరు తెరిచి అడగ్గా చేసుకుంటాను మామయ్యా.. అంటూ సంతోషంగా సమాధానమిచ్చింది. వినోదాన్ని పంచుతున్న ఈ ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ "ఓ మంచి రోజు చూసి చెప్తా" చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి నటన ఈ చిత్రానికే హైలైట్. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. మా చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. సెన్సార్ సభ్యులు సినిమా అద్భుతంగా ఉంది అని మెచ్చుకున్నారు" అని తెలిపారు. కాగా చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి తర్వాత విడుదల అవుతున్న నిహారిక మొదటి చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల అవుతోంది. బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరా: శ్రీ శరవణన్, ఎడిటర్: అర్ గోవింద్ రాజ్, పీఆర్వో: పాల్ పవన్

చదవండి: నైన్త్‌ క్లాస్ ‌నుంచే నిహా తెలుసు: చైతన్య

బిచ్చగాడు 2 డైరెక్ట్‌ చేసేది ఆయనే: హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement