భువనేశ్వర్: అనారోగ్యంతో ప్రముఖ గాయని తప్పూ మిశ్రా శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. పదహారేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసిన ఈమె కొన్ని వేల పాటలు పాడి శ్రోతలకు వీనులవిందు కలిగించారు. గీతాలాపనలో ఈమె చూపిన అత్యుత్తమ ప్రతిభకి 4 రాష్ట్ర చలనచిత్ర అవార్డులు రావడం విశేషం. మొత్తం 160 ఒడియా సినిమాలు, 22 బెంగాళీ చిత్రాల్లో ఈమె పాటలు పాడింది.
ఇటీవల కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నారు. అయితే ఇంటికి చేరిన కొన్నిరోజులకే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో మంచాన పడిన ఈమె చికిత్సకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కళాకారుల సంక్షేమ నిధి నుంచి రూ.1 లక్ష ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే. తప్పూ మిశ్ర మృతితో ఒడియా చలన చిత్ర రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈమె మృతికి సంతాపం ప్రకటించారు.
చదవండి : మరో బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమంత
దర్శకుడు సుశీంద్రన్ రూ.5 లక్షల విరాళం
Comments
Please login to add a commentAdd a comment