సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఒడియా టీవీ నటి రాజేశ్వరి రే మహాపాత్ర క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. కొంతకాలంగా మెదడు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో ఒడియా సిని పరిశ్రమలో విషాదం నెలకొంది.
చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు టీవీ, సినీ నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాను క్యాన్సర్‌తో పోరాడుతున్నానంటూ 2019లో రాజేశ్వరీ రే ఫేస్‌బుక్‌లో ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. దీంతో తను త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆమె ఫ్యాన్స్ ప్రార్థించారు. కాగా ‘స్వాభిమానం’ అనే ఒడియా సీరియల్‌తో మహాపాత్ర మంచి గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment