బాలీవుడ్‌ సీనియర్‌ నటి కన్నుమూత | Senior Actress Shashikala Om Prakash Saigal Lost Breath At 88 | Sakshi
Sakshi News home page

సీనియర్‌ నటి శశికళ కన్నుమూత

Published Sun, Apr 4 2021 6:13 PM | Last Updated on Sun, Apr 4 2021 9:43 PM

Senior Actress Shashikala Om Prakash Saigal Lost Breath At 88 - Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ నటి శశికళ ఓమ్‌ ప్రకాశ్‌ సైగల్‌(88) కన్నుమూశారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జన్మించిన ఆమె ముంబైలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రచయిత కిరన్‌ కొట్రైల్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. శశికళ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎన్‌సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్‌ పవార్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

కాగా వెటరన్‌ నటి శశికళ 'ముజే షాదీ కరోగీ', 'తీన్‌ బత్తి చార్‌ రాస్తా' సహా వందకు పైగా సినిమాల్లో నటించింది. అలాగే 'సోన్‌పారీ', 'జీనా ఇసి క నామ్‌ హై' వంటి హిందీ సీరియళ్లలోనూ ప్రముఖ పాత్రలు పోషించింది. సినీ ఇండస్ట్రీలో ఆమె అందించిన సేవలకు గానూ ప్రభుత్వం ఆమెను 2007లో పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది.

చదవండి: బ్రేకప్‌ భరించడం చాలా కష్టం: అంజలి

అక్షయ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement