Sai Dharam Tej Republic Movie In OTT: Release Date, Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Republic Movie OTT Release: ఓటీటీలోకి సాయి ధరమ్‌ తేజ్‌ రిపబ్లిక్‌ మూవీ

Published Tue, Nov 2 2021 4:11 PM | Last Updated on Tue, Nov 2 2021 4:39 PM

OTT: Sai Dharam Tej Republic Movie Streaming On ZEE5 On November 26th - Sakshi

Sai Dharam Tej Republic Movie Streaming On OTT: మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్, ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా నటించిన  చిత్రం ‘రిపబ్లిక్‌’. దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గత నెల అక్టోబర్‌ 1న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ నటి ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. విడుదలైన రోజు నుంచే మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్‌ పరంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస వద్ద బొల్తా కొట్టింది.

చదవండి: Theaters/OTT: ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే..

ఈ నేపథ్యంలో రిపబ్లీక్‌ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ మూవీ నవంబర్‌ 26 నుంచి స్ట్రిమింగ్‌ కానుంది. కాగా రిపబ్లిక్‌ మూవీ విడుదల సమయానికి సాయి తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం విధితమే. దీంతో మెగాస్టార్ చిరంజీవి, ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రుండి ఈ సినిమాను ప్ర‌మోట్‌ చేశారు. దానికి త‌గ్గ‌ట్టే ఓపెనింగ్స్ కూడా భారీగానే వ‌చ్చాయి. ఈ క్రమంలో సినిమా కూడా బాగుంద‌ని టాక్ వ‌చ్చినప్పటికీ అదే జోరును కొనసాగించలేకపోయింది. ఆశించిన మేర కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. 

చదవండి: ఎవడు బ్రో నీకు చెప్పింది.. ఓ వెబ్‌సైట్‌పై రానా అసహనం​

దీనికి కారణం.. సినిమా చివ‌ర్లో హీరో పాత్ర చ‌నిపోవ‌డం ప్రేక్షకులకు నచ్చలేదు. దీనికి తోడు క‌రోనా భ‌యంతో చాలామంది థియేట‌ర్ల‌కు రావడానికి ఇష్ట‌ప‌డ‌కపోవటం కూడా ఈ సినిమా పరాజయానికి ఒక కారణం. 12.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ సినిమా కేవ‌లం 6.85 కోట్ల షేర్స్‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. బ‌య్య‌ర్ల‌కు రూ.5.65 కోట్ల న‌ష్టాన్ని మిగిల్చింది. వెండితెరపై నిరాశ పరిచిన ఈ మూవీ బుల్లితెరపై ఎంత మేర ఆకట్టుకుంటోంది కొద్ది రోజులు వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement