Paagal Pavithraa Buy Old Home Her Village - Sakshi
Sakshi News home page

Paagal Pavithraa: బ్యూటీ సెలూన్‌ అమ్మేసి పాత ఇల్లు కొన్న లేడీ కమెడియన్‌

Published Sun, Dec 4 2022 4:34 PM | Last Updated on Mon, Dec 5 2022 11:07 AM

Paagal Pavithraa Buy Old Home In Her Village - Sakshi

కామెడీ షోలో మహిళలు కూడా భాగస్వామ్యులయ్యారు. మగవారికంటే కూడా మేమేం తక్కువ కాదంటూ సరికొత్త స్కిట్లతో గ్యాప్‌ లేని పంచులతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. అందులో పవిత్ర కూడా ఒకరు. గతేడాది తండ్రిని కోల్పోయిన ఆమె కుటుంబ పోషణను తన భుజాల మీద వేసుకుంది. తాజాగా ఆమె ఓ పాతింటిని కొనుగోలు చేసి దానికి మెరుగులు దిద్దుతోంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో ద్వారా వెల్లడించింది 

ఈ వీడియోలో పవిత్ర మాట్లాడుతూ.. 'నేను పుట్టి పెరిగిన ఊరిలో ఇంతవరకు సొంతిల్లు లేదు. నాకు బ్యూటీ సెలూన్‌ ఉండేది. అది అమ్మేయగా వచ్చిన డబ్బులతో పాత ఇల్లు అమ్ముతుంటే నేను తీసుకున్నాను. కాకపోతే వాస్తు బాలేదని కొన్ని మార్పుచేర్పులు చేస్తున్నాను. ఇంకో నెలలో నాన్న సంవత్సరీకం ఉంది. అప్పటిలోపు ఇంటిపనులు అన్నీ పూర్తి చేయాలనుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది.

చదవండి: హీరో అడివి శేష్‌కు ఆదిరెడ్డి కౌంటర్‌, నాగ్‌ మామూలుగా నవ్వలేదుగా
బాహుబలి సింగర్‌కు త్వరలో పెళ్లి, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement