కిడ్స్... మీరెప్పుడైనా ఆఫ్రికా ఫారెస్ట్ చూశారా! మీరు ఇప్పటిదాకా చూసినా చూడక΄ోయినా ఈ మూవీతో మీరు ఆఫ్రికా ఫారెస్ట్ చూడవచ్చు. మీరే కాదు మీతో పాటు ఓ సూపర్ కో పాసింజర్ కూడా ఉంది. అదే మనందరికీ ఇష్టమైన పాండా. అదేలాగంటారా ప్రైమ్ వీడియో ఓటిటి లో స్ట్రీమ్ అవుతున్న పాండా బేర్ ఇన్ ఆఫ్రికా మూవీని అర్జెంట్ గా చూసేయండి.
ఈ మూవీ మొత్తం ఆఫ్రికా ఫారెస్ట్ లోని సూపర్ విజువల్స్ తో మంచి కామెడీతో ఉంటుంది. పాండా బేర్ ఇన్ ఆఫ్రికా మూవీ స్టోరీ ఏంటంటే...ఇథలిక్ విలేజ్ లో పాంగ్ అనే ఓ యంగ్ పాండా ఉంటుంది. దానికి జీలాంగ్ అనే ఓ చిన్న డ్రాగన్ మంచి ఫ్రెండ్. లయన్ కింగ్ డమ్ వాళ్ళు తమ యంగ్ లయన్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి జీలాంగ్ డ్రాగన్ ను ఆఫ్రికాకి కిడ్నాప్ చేస్తారు. అప్పుడు పాంగ్ తన ఇంకో మంకీ ఫ్రెండ్ జోజోతో కలిసి జీలాంగ్ డ్రాగన్ ను సేవ్ చేయడానికి ఆఫ్రికా బయలుదేరుతుంది.
పాంగ్ లాంటి చిన్న పాండా జీలాంగ్ లాంటి పెద్ద డ్రాగన్ ను ఆఫ్రికా వెళ్ళి సేవ్ చేస్తుందా లేదా అన్నది మాత్రం మీరు పాండా బేర్ ఇన్ ఆఫ్రికా మూవీ లోనే చూడాలి. ఈ మూవీ మొత్తం పాండా చేసే స్టంట్స్, పాండా మంకీ ఫ్రెండ్ జోజో చేసే అల్లరి అలాగే వాళ్ళతో కలిసే మరో హైనా చేసే కామెడీ చాలా బాగుంటుంది. సో కిడ్స్ బకల్ అప్ విత్ రిమోట్ అండ్ క్రూస్ టు ప్రైమ్ వీడియో టు విట్నెస్ ఆఫ్రికా విత్ పాండా బేర్.
Comments
Please login to add a commentAdd a comment