దూత నటి హోంటూర్‌.. వాటికి తనే తల్లినంటూ.. | Parvathy Thiruvothu Home Tour Highlights | Sakshi

Parvathy Thiruvothu: దూత నటి ఇల్లు చూశారా? బాల్కనీ అయితే అదిరిపోయింది!

Mar 23 2024 4:34 PM | Updated on Mar 23 2024 5:07 PM

Parvathy Thiruvothu Home Tour Highlights - Sakshi

నా ఇంట్లో మామిడి చెట్టు ఉంది. నిమ్మకాయ చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు నుంచి నిమ్మకాయలు తెంపుకుని వాటినే సలాడ్‌లో వాడుతూ ఉంటాను. ఇది చూసి జనాలు షాక్‌ అ

పార్వతి తిరువోతు.. మలయాళీ ముద్దుగుమ్మ. ఔట్‌ ఆఫ్‌ సిలబస్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కేవలం మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. బెంగళూరు డేస్‌, చార్లీ, ఎన్ను నింటె మొయిదీన్‌, టే​కాఫ్‌ వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

ఇంట్లోనే మామిడి, నిమ్మ.. 
గతేడాది రిలీజైన దూత అనే వెబ్‌ సిరీస్‌తో తెలుగువారికి పరిచయమైంది. తాజాగా ఆమె తన హోంటూర్‌ చేసింది. 'నా ఇంట్లో మామిడి చెట్టు ఉంది. నిమ్మకాయ చెట్టు కూడా ఉంది. ఆ చెట్ల నుంచి ఫలాలు తెంపుకుని వాటినే సలాడ్‌లో వాడుతూ ఉంటాను. ఇది చూసి జనాలు షాక్‌ అవుతూ ఉంటారు. నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈ ఇల్లు నన్ను హత్తుకున్నట్లుగా అనిపిస్తుంది.

పడేయడం నచ్చదు
నాకంటూ ఓ లైబ్రరీ కూడా ఉంది. నటిగా నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలీదు కాబట్టి ఇంట్లో అన్ని వస్తువులు తెచ్చి నింపేసుకోను. వస్తువులు పాతగైపోగానే పడేయడం ఇష్టముండదు. 19 ఏళ్లుగా ఓ చిన్న మొక్క కూడా నాతోనే ఉంది. దాదాపు 36 మొక్కలకు నేను తల్లినైపోయాను. ఈ బాల్కనీలో ఉండటం ఎంతో ఇష్టం' అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు హీరోయిన్‌ తన బాల్కనీని పచ్చదనంతో నింపేసింది, పెద్దగా సామాన్లు లేకుండా చాలా బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: 'దేవర'లో నా పాత్ర ఇదే.. రివీల్‌ చేసిన మరాఠీ బ్యూటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement