Actress Payal Rajput Interesting Post On Marriage; Post Goes Viral - Sakshi
Sakshi News home page

Payal Rajputh: సోల్‌ మేట్‌ కోసం వెతుకుతూనే ఉన్నారు.. పాయల్ పోస్ట్ వైరల్!

Published Wed, Aug 9 2023 4:08 PM | Last Updated on Wed, Aug 9 2023 5:00 PM

Payal Rajputh Post ON Marriages Goes Viral In Social Media - Sakshi

పాయల్ రాజ్‌పుత్‌ పరిచయం అక్కర్లేని పేరు. ఆర్‌ఎక్స్‌100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సూపర్‌ హిట్‌ కొట్టిన ప్రస్తుతం మంగళవారం సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే మనముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే టీజర్‌ రిలీజ్‌ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అయితే ఈ చిత్రంలో నటిస్తోన్న పాయల్ రాజ్‌పుత్‌ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది ముద్దుగుమ్మ. తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందో తెలుసుకుందాం. 

ఇప్పుడు తాజాగా పాయల్ చేసిన పోస్ట్‌లో ఏముందంటే..' నీకు ఇంకా సోల్ మేట్ దొరకలేదని బాధపడకు. పెళ్లైన వారు కూడా సోల్ మేట్ కోసం వెతుకుతూనే ఉన్నారు.' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ పాయల్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అంటే కొత్తగా పెళ్లి చేసుకునే వారితో పాటు.. పెళ్లయిన వారు కూడా అభద్రతతో ఉన్నారని ఆ పోస్ట్ సందేశం. దీంతో ఈ భామ చేసిన పోస్ట్‌పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. 

అయితే ఆర్ఎక్స్100 తర్వాత తెలుగులో సరైన హిట్‌ దక్కలేదు. వెంకీమామ, డిస్కో రాజా, తీస్‌మార్‌ ఖాన్, జిన్నా చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. అందం ఉన్నా ఈ అమ్మడుకి కలిసిరావడం లేదు. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న మంగళవారం సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పడుతుందో వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement