‘ప్లాట్’ సరికొత్త ప్రయోగాత్మక చిత్రం: వేణు ఊడుగుల | PLOT Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

‘ప్లాట్’ సరికొత్త ప్రయోగాత్మక చిత్రం: వేణు ఊడుగుల

Published Fri, Oct 27 2023 3:27 AM | Last Updated on Fri, Oct 27 2023 7:23 AM

PLOT Movie Trailer Launch - Sakshi

భాను భవతారక, వేణు ఊడుగుల, గాయత్రి, వికాస్‌

వికాస్‌ ముప్పాల, గాయత్రీ గుప్తా, సాజ్వి పసల, సంతోష్‌ నందివాడ, కిశోర్‌ ప్రధాన పాత్రధారులుగా భాను భవతారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్లాట్‌’. కార్తీక్‌ సేపురు, తరుణ్‌ విఘ్నేశ్వర్‌ సేరుపు, భాను భవ తారక ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి అతిథిగా హాజరై, ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. దర్శక–నిర్మాతలు ఈ తరహా సినిమాలను తీయాలంటే ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు.

‘‘నా కెరీర్‌కు ఈ సినిమా టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు వికాస్‌ ముప్పల. ‘‘ఈ సినిమాను చూసి ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు భాను భవతారక, తరుణ్‌ విఘ్నేశ్వర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement