అప్పుడు బాధపడలేదు.. భయపడలేదు: పూజా హెగ్డే | Actress Pooja Hegde Reacts On Her Hit And Flop Movies, Check Out More Insights | Sakshi
Sakshi News home page

Pooja Hegde: ఆ ఇబ్బందులపై పూజా హెగ్డే రియాక్షన్

Published Sat, Nov 9 2024 7:34 AM | Last Updated on Sat, Nov 9 2024 10:29 AM

Pooja Hegde Reacts On Her Hit And Flop Movies

జీవితంలో ఎవరికైనా జయాపజయాలు సహజం. సినీ సెలబ్రిటీలు కూడా దీనికి అతీతం కాదు. హీరోయిన్ పూజాహెగ్డే విషయానికి వస్తే గత 12 ఏళ్లుగా దక్షిణాదిలో సినిమాలు చేస్తోంది. 'మాస్క్' అనే తమిళ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో వరస సినిమాలు చేసింది. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలతో కలిసి హిట్స్ అందుకుంది. తమిళంలో విజయ్‌ 'బీస్ట్‌'లో నటిస్తే అది నిరాశపరిచింది. అదే టైంలో తెలుగు, హిందీలోనూ పూజాహెగ్డే చిత్రాలు ఫ్లాప్ అవడంతో పనైపోయిందనే ప్రచారం జోరందుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?)

ప్రస్తుతం హిట్స్‌ లేకపోయినా భారీ అవకాశాలు పూజాహెగ్డే తలుపు తట్టడం విశేషం. తమిళంలో సూర్య-కార్తీక్‌ సుబ్బరాజ్‌ మూవీలో చేస్తోంది. విజయ్‌ 69వ మూవీలోనూ ఈమెనే హీరోయిన్. తెలుగులోనూ మళ్లీ ఛాన్సులు వస్తున్నాయట. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజాహెగ్డే.. తన కెరీర్‌‪‌లో అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడింది. తన మార్కెట్‌ పడిపోయిందనే దాని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని చెప్పింది.

హిట్ ఫ్లాప్స్ గురించి బాధ పడిందిలేదు, భయపడింది లేదని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. తన వరకూ తాను తన పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తున్నానని, మంచి టైమ్‌ కోసం ఎదురు చూస్తున్నానని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం రెండు తమిళం, ఒక హిందీ చిత్రాలు ఉన్నాయని పూజాహెగ్డే పేర్కొంది. 

(ఇదీ చదవండి: Bigg Boss 8: ఈసారి ఆమె ఎలిమినేషన్ తప్పదేమో?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement