![Is Pooja Hegde Tie Up With Vijay Devarakonda For Jana Gana Mana Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/6/pooja-hegde_0.jpg.webp?itok=tztiTNN8)
P పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటించనున్న రెండో సినిమా 'జనగణమన' (JGM). లైగర్ సెట్స్‌పై ఉండగానే ఈ మూవీని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ముంబైలో గ్రాండ్‌గా ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన ఎవరు నటించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
చదవండి: సమంత వర్సెస్ నాగచైతన్య, ఫలితం ఎలా ఉండనుందో?
అయితే గతంలో విజయ్ సరసన దివంగత నటి, ‘అతిలోక సుందరి’ శ్రీదేవీ కూతురు జాన్వి కపూర్ నటించనుందని, ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ పుకార్లను ఆమె కొట్టేస్తూ తాను ఇప్పటి వరకు ఏ సౌత్ సినిమాకు సంతకం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ పుకార్లకు చెక్ పడింది. దీంతో మరోసారి జనగనమణలో హీరోయిన్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తెలుగు స్టార్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ‘బుట్టబొమ్మ’ పూజ హెగ్డే విజయ్‌తో జతకట్టనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: రూ. 400 కోట్ల క్లబ్‌లోకి కేజీయఫ్ 2, హిందీలో ఈ 2 దక్షిణాది సినిమాలే టాప్
ఇప్పటికే డైరెక్టర్ పూరి ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుందని వినికిడి. ఇటీవల ఆచార్యతో అలరించిన పూజ ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28, కభీ ఈద్ కభీ దీపావళి, భవదీయుడు భగత్ సింగ్‌తో పాటు సర్కస్ సినిమాలతో బిజీగా ఉంది. అటు విజయ్ దేవరకొండ జనగణమనతో పాటుగా శివ నిర్వాణలో దర్శకత్వంలో సమంతతో మరోసారి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇటీవల సెట్స్‌పైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment