Posani Krishna Murali Condolences To Sarath Babu Sudden Demise - Sakshi
Sakshi News home page

Posani Krishna Murali: ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు: పోసాని కృష్ణమురళి

Published Mon, May 22 2023 3:38 PM | Last Updated on Mon, May 22 2023 3:52 PM

Posani Krishna Murali Condolences To Sarath Babu Sudden Demise - Sakshi

సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల  ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మనిషి , అజాత శత్రువు అయినా శరత్ బాబు  మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని ఆయన అన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. 

(ఇది చదవండి: Sarath Babu: శరత్‌బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు! మూడుసార్లు..)

కాగా.. శరత్ బాబు 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో నటించి గుర్తింపు పొందారు. దాదాపు 300కు సినిమాల్లో విభిన్న పాత్రలతో మెప్పించారు. ఆయన చివరిసారిగా నరేశ్- పవిత్ర కలిసి నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో కనిపించారు. అనారోగ్య కారణాలతో గత నెల ఆస్పత్రిలో చేరిన శరత్ బాబు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

(ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement