![Prabhas Salaar Next Schedule Start From April Second Week - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/28/Prabhas-Salaar.jpg.webp?itok=_WJ8C8bW)
‘రాధేశ్యామ్’ సినిమా షూట్‌ను దాదాపు పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాల షూటింగ్స్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు ప్రభాస్. ముంబయ్‌లో ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ మొదటివారం వరకు జరుగుతుంది. ఈ షూట్ తర్వాత ఏప్రిల్ రెండోవారంలో ‘సలార్’ షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అవుతారు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతుంది. ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు ప్రశాంత్ అండ్ కో. ‘సలార్’ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని 2022 ఆగస్టు11న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలు కాకుండా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment