హీరోయిన్స్‌తో క్రికెటర్లు ప్రేమలో పడటం సాధారణమే విషయమే. ఇప్పటికే టిమిండియా క్రికెటర్లు పలువురు బాలీవుడ్ భామలతో ప్రేమ వ్యవహరం నడిపిన సంగతి తెలిసిందే. అందులో కొందరు బ్రేకప్ చెప్పుకుని విడిపోగా.. మరికొందరూ ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. ఇక తాజాగా వీరి జాబితాల్లోకి యంగ్ క్రికెటర్ పృథ్విషా చేరాడు. అతడు కొంతకాలంగా బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ సింగ్‌తో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇద్దరు కలిసి పార్టీలకు, డిన్నర్ డేట్స్ వెళుతూ కెమారాలకు చిక్కారు. దీంతో పృథ్వీ, ప్రాచీ ప్రేమలో మునిగితేలుతున్నాడంటూ కొద్ది రో జులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రాచీని పృథ్వీషా రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌గా అంతా పేర్కొంటున్నారు. అయితే దీనిపై ఇంతవరకు పృథ్వీషా కానీ, ప్రాజీ సింగ్ కానీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రాచీ న్యూ ఇయర్ సందర్భంగా ఓ ఫొటోను షేర్ చేసి ఈ రూమర్లకు ఇలా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పృథ్వీషాతో క్లోజ్‌గా దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె షేర్ చేసింది.
దీంతో వీరి రిలేషన్‌పై వస్తున్న పుకార్లకు ప్రాచీ ఈ ఫొటో క్లారిటీ ఇచ్చిందా? లేక న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరి రిలేషన్‌ను ఆఫిషయల్ చేసిందా? అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రాచీ షేర్ చేసిన ఈ ఫొటోను చూసి ‘జంట చాలా బాగుంది’ అంటూ వారి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా సోషల్ మీడియాలో వీరిద్దరూ తరచూ ఒకరిపోస్ట్‌పై ఒకరూ స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేసుకుంటు ఉంటారనే విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment