
Prince Pellikuturu Party Movie Release Date Announced: ప్రిన్స్, అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయి కీర్తన్, ఫణి ప్రధాన తారాగణంగా నటిచిన చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. అపర్ణ దర్శకత్వంలో ఏవీఆర్ స్వామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అపర్ణ మాట్లాడుతూ– ‘‘ఇది అమ్మాయిల కథ. ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ చెప్పాను’’అని తెలిపారు.
‘‘మా సినిమా రిలీజ్ తర్వాత ఇందులోని నటీనటులందరూ బిజీ అయిపోవాలని కోరుకుంటున్నాను’’ అని ప్రిన్స్ పేర్కొన్నాడు. ‘‘ఈ మూవీలో హెలీకాఫ్టర్ పైలెట్‌గా చేశా. అన్ని ఎమోషన్స్ ఉన్న ఫ్యామిలీ డ్రామా చిత్రమిది’’ అన్నారు అర్జున్ కల్యాణ్. ‘‘పీవీఆర్ సినిమాస్‌తో పాటు సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్స్ వారు మా సినిమాకి మంచి సపోర్ట్ చేస్తున్నారు’’ అని నిర్మాత స్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సీత తదితరులు పాల్గొన్నారు.
చదవండి:👇
లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ !
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్
సినిమా సెట్‌లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు
చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment