
బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. ఆయన మరణవార్త సినీ పరిశ్రమలో పెను విషాదాన్ని నింపింది. కన్నడ హీరో అయినప్పటికి.. పునీత్ రాజ్‌కుమార్‌కు టాలీవుడ్ హీరోలతో మంచి సంబంధం ఉంది. రామ్ చరణ్ వంటి హీరోలతో పునీత్‌కు మంచి రిలేషన్ ఉండేది.
ముఖ్యంగా జూ.ఎన్టీఆర్‌ను తన సోదరుడిలా భావించేవారు పునీత్ రాజ్‌కుమార్. ఈ విషయాన్ని గతంలో పునీత్ రాజ్‌కుమారే స్వయంగా వెల్లడించారు. తారక్ మా ఫ్యామిలీ మెంబర్. తనను నా సోదరుడిగా భావిస్తాను అని తెలిపారు. ఇక పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడారు. గెలియా.. గెలియా.. అంటూ సాగే ఈ పాట సూపర్ హిట్.
(చదవండి: శోక సంద్రంలో పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు... వారి భయమే నిజమైంది)
పునీత్ రాజ్‌కుమార్.. శాండల్‌వుడ్‌లో సూపర్ స్టార్. కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్ మూడో కుమారుడు. మొదటి కుమారుడు శివరాజ్ కుమార్ కూడా కన్నడ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు.
చదవండి:
Puneeth Rajkumar: నోటమాట రాలేదు.. చిరంజీవి ఎమోషనల్
కంఠీరవం స్టేడియానికి పునీత్ రాజ్‌కుమార్ మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment