
సినిమా వాళ్లకు సినిమా థియేటర్ చాలా ప్రవిత్రమైనది. తమ కష్టాన్నంతా కళ్లారా చూసుకునే చోటు అది. అయితే కోవిడ్ వల్ల థియేటర్స్ మూతపడ్డాయి. సుమారు ఏడు నెలల విరామం తర్వాత థియేటర్లను ఇటీవలే ఓపెన్ చేశారు. అయితే థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇలాంటి సందర్భంలో కన్నడ చిత్రపరిశ్రమ ఓ వీడియోను విడుదల చేసింది.
అందులో ధైర్యంగా సినిమాలకు రండి అంటూ కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, ఆయన తమ్ముడు పునీత్ రాజకుమార్, ఇతర హీరోలు ప్రేక్షకులను కోరారు. ఈ వీడియో చూడగానే కళ్లు చెమ్మగిల్లాయి అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసి – ‘‘మళ్లీ ఆ రోజులు రావాలి (థియేటర్స్ నిండుగా ప్రేక్షకులు ఉండాలనే ఉద్దేశంతో). విజిల్స్ వేయాలి. పేపర్స్ ఎగరాలి. చొక్కాలు చిరగాలి. సినిమా థియేటర్ మన అమ్మ’ అన్నారు పూరి.
I got tears after watching this 👌🏾. మళ్ళీ ఆ రోజులు రావాలి . విజిల్స్ వెయ్యాలి , పేపర్స్ ఎగరాలి . చొక్కాలు చిరగాలి .. సినిమా థియేటర్ 🔥.. మన అమ్మ 🙏🏽 pic.twitter.com/TAnemU102d
— PURIJAGAN (@purijagan) November 16, 2020
Comments
Please login to add a commentAdd a comment