
హైదరాబాద్‌లో ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ పుష్ప విడుదల కావడంలేదని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. కొత్త సినిమా విడుదలైతే చాలు ఇక్కడకు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు హైదరాబాద్ నగరవాసులు భారీ ఎత్తున్న వస్తుంటారు. రివ్యూవర్స్ కూడా ఈ థియేటర్ వద్ద తమ కెమెరాలు పట్టుకుని సందడిగా కనిపిస్తుంటారు. అయితే, పాన్ ఇండియా రేంజ్‌ను దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా థియేటర్స్‌లలో పుష్ప2 విడుదలైంది. కానీ, ప్రసాద్ మల్టీ ప్లెక్స్‌లో మాత్రం రిలీజ్ కాలేదు. ఇదే విషయాన్ని తెలుపుతూ తాజాగా సోషల్ మిడియాలో ఒక ప్రకటన కూడా వెలువడింది.
(ఇదీ చదవండి: Pushpa 2 Movie Review బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?)
ప్రసాద్ ఐమాక్స్‌లో పుష్ప సినిమా చూడాలని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఈ సినిమాను తమ థియేటర్స్‌లో ప్రదర్శించడం లేదని ప్రసాద్ ఐమాక్స్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ షోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ' దాదాపు 20ఏళ్లకు పైగా సినిమా అభిమానులకు మేము అత్యుత్తమమైన అనుభూతిని కల్పించేలా థియేటర్స్‌ను రన్ చేస్తున్నాం. అయితే, పలు అనివార్య కారణాల వల్ల పుష్ప2 చిత్రాన్ని మీ అందరికీ ఇష్టమైన ప్రసాద్ ఐమాక్స్‌లో రన్ చేయలేకపోతున్నాం. ఈ విషయం చెప్పి మీకు ఇబ్బంది కలిగించినందుకు మాకు కూడా బాధగానే ఉంది. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.' అని పేర్కొన్నా ప్రసాద్ టీమ్.. అసలు కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
అయితే, చిత్ర నిర్మాతలు, థియేటర్ యాజమాన్యం మధ్య అగ్రిమెంట్ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. రెవెన్యూ షేరింగ్ విషయంలో ఇద్దరి మధ్య సరైన ఒప్పందం సెట్ కాకపోవడం పుష్ప2 సినిమా ప్రసాద్ ఐమ్యాక్స్‌లో విడుదల కాలేదని సమాచారం.
We deeply regret this inconvenience and sincerely thank you for your understanding and continued support.#Pushpa2TheRule #PrasadMultiplex pic.twitter.com/vaUHN2rpFg
— Prasads Multiplex (@PrasadsCinemas) December 5, 2024