Prasad i-Max
-
హైదరాబాద్‌లోనే టాప్ థియేటర్.. కానీ, 'పుష్ప2'ను ప్రదర్శించలేదు
హైదరాబాద్‌లో ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ పుష్ప విడుదల కావడంలేదని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. కొత్త సినిమా విడుదలైతే చాలు ఇక్కడకు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు హైదరాబాద్ నగరవాసులు భారీ ఎత్తున్న వస్తుంటారు. రివ్యూవర్స్ కూడా ఈ థియేటర్ వద్ద తమ కెమెరాలు పట్టుకుని సందడిగా కనిపిస్తుంటారు. అయితే, పాన్ ఇండియా రేంజ్‌ను దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా థియేటర్స్‌లలో పుష్ప2 విడుదలైంది. కానీ, ప్రసాద్ మల్టీ ప్లెక్స్‌లో మాత్రం రిలీజ్ కాలేదు. ఇదే విషయాన్ని తెలుపుతూ తాజాగా సోషల్ మిడియాలో ఒక ప్రకటన కూడా వెలువడింది.(ఇదీ చదవండి: Pushpa 2 Movie Review బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?)ప్రసాద్ ఐమాక్స్‌లో పుష్ప సినిమా చూడాలని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఈ సినిమాను తమ థియేటర్స్‌లో ప్రదర్శించడం లేదని ప్రసాద్ ఐమాక్స్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ షోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ' దాదాపు 20ఏళ్లకు పైగా సినిమా అభిమానులకు మేము అత్యుత్తమమైన అనుభూతిని కల్పించేలా థియేటర్స్‌ను రన్ చేస్తున్నాం. అయితే, పలు అనివార్య కారణాల వల్ల పుష్ప2 చిత్రాన్ని మీ అందరికీ ఇష్టమైన ప్రసాద్ ఐమాక్స్‌లో రన్ చేయలేకపోతున్నాం. ఈ విషయం చెప్పి మీకు ఇబ్బంది కలిగించినందుకు మాకు కూడా బాధగానే ఉంది. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.' అని పేర్కొన్నా ప్రసాద్ టీమ్.. అసలు కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.అయితే, చిత్ర నిర్మాతలు, థియేటర్ యాజమాన్యం మధ్య అగ్రిమెంట్ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. రెవెన్యూ షేరింగ్ విషయంలో ఇద్దరి మధ్య సరైన ఒప్పందం సెట్ కాకపోవడం పుష్ప2 సినిమా ప్రసాద్ ఐమ్యాక్స్‌లో విడుదల కాలేదని సమాచారం. We deeply regret this inconvenience and sincerely thank you for your understanding and continued support.#Pushpa2TheRule #PrasadMultiplex pic.twitter.com/vaUHN2rpFg— Prasads Multiplex (@PrasadsCinemas) December 5, 2024 -
జడల బొమ్మాళి
బీటెక్ చదువుతున్న హ్యాపీ డేస్ అవి. కొత్తగా ఓపెన్ చేసిన ప్రసాద్స్ ఐమాక్స్ లోని స్కేరీ హౌస్ కి వెళ్లాలని కొద్ది రోజులుగా మా హాస్టల్ బ్యాచ్ అందరి కోరిక. మా గ్యాంగ్‌లో మేము మొత్తం పదిమందిమి. చిన్నపాటి ఆనందాలకి కూడా తెగ సంబరపడిపోయే బ్యాచ్ మాది. సరదా అయినా, షికారు అయినా అందరం కలిసే వెళ్ళేవాళ్ళం. మొత్తానికి అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక ఆదివారం నెక్లెస్ రోడ్‌లోని ఈట్ స్ట్రీట్‌కి వెళ్ళాము. అప్పుడే రిలీజ్ అయిన ఆనంద్ మూవీ ఎఫెక్టేమో! స్టీమ్దోశ, ఫిల్టర్ కాఫీ మాకు ఒక క్రేజీ కాంబినేషన్. ఈట్ స్ట్రీట్‌లో టిఫిన్ అయ్యాక, ప్రసాద్స్ ఐమాక్స్ వెళ్లాము. అద్దాలతో మెరిసిపోతోంది ఐమాక్స్. షాపింగ్ మాల్స్ అంటే ఇలా వుంటాయని అప్పుడప్పుడే తెలుసుకుంటున్న మాకు అది మరో ప్రపంచంలా కనిపించింది. కళ్ళు జిగేలుమనేలా చుట్టూ షాప్ ఔట్లెట్స్. మాల్ మొత్తం సుమారు ఒక గంటన్నర పాటు తిరిగి మా ఫైనల్ డెస్టినేషన్ అయిన స్కేరీ హౌస్ దగ్గరకు చేరుకున్నాం. అప్పటికే చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ. ఒకపక్క నవ్వులు, మరోపక్క కేకలు అరుపులతో మొత్తం హడావుడిగా ఉంది. ఎక్కువ ఆలస్యం చేయకుండా చకచకా టికెట్స్ తీసుకొని మేము కూడా క్యూలో నిలుచున్నాం. అప్పటి వరకు ధైర్యంగా వున్నా, హౌస్ లోపలి నుంచి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్‌కు, కేకలకు మా అందరిలో ఏదో మూల కొంచెం భయం మొదలైంది. అలా క్యూలో అరగంట గడిచింది. లోపలికి వెళ్ళడానికి మా ముందు ఇంకా రెండు బ్యాచులు మిగిలి ఉన్నాయి. అంతలో మానస ‘వామ్మో! నాకు మస్తు భయం ఐతాందే. నా వల్ల కాదు. నే డ్రాప్ ఐతా..’ ఏడుపు గొంతుతో అంది. దానికి అసలే భయం ఎక్కువ. ఏదో మేనేజ్ చేసి ఇంత దూరం లాక్కొచ్చాము. దాని మాటలకి రాధిక, శిల్ప కూడా వంతపాడారు. ‘ఒసేయ్ ఎంకి! లోపల ఉన్నవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్. మనుషులే దయ్యాల్లాగా ఉత్తుత్తి యాక్షన్. అంతా మనల్ని భయపెట్టడానికేనే’ ధైర్యం నూరిపోసింది లచ్చి. మృదుల, కన్య కూడా మానసని ఒప్పించడానికి వాళ్ల వంతు తంటాలు పడ్డారు. ఎలాగోలా మొత్తానికి మానసని ఒప్పించారు. మా మాటల్లో పడి క్యూ కదులుతున్న సంగతి కూడా మర్చిపోయాం. లోపలికి వెళ్లాల్సిన నెక్ట్స్ట్ బ్యాచ్ మాదే. డోర్ దగ్గర పొడుగ్గా ఒకతనునల్ల చొక్కా, నల్ల టోపీ వేసుకుని ఉన్నాడు. ‘లోపట మస్తు భయమేస్తదా ?‘‘గట్టిగ అరిస్తే జర సౌండ్ తగ్గించున్రి భయ్యా!!’..‘ఏ చోట ఎక్కువ భయం ఏస్తది ?’ ఇలా రాధిక కురిపించిన ప్రశ్నల వర్షానికి జవాబు అన్నట్టుగా స్కేరీ హౌస్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు అతను. సగం ధైర్యం, సగం భయంతో మేము ఒకరి చేయి ఇంకొకరం గట్టిగా పట్టుకుని లోపలికి వెళ్ళాము. డోర్ మూసుకుంది. అంతా మసక మసకగా ఉంది. అక్కడక్కడా లాంతరు వెలుగు మిణుకుమంటోంది. అంతలో ఎక్కడ నుంచి ప్రత్యక్షమయ్యాడో ఒకడు వికృతంగా నవ్వుతూ మాకు ఎడమ వైపున్న గోడను చూపించాడు. గోడపై ఏదో రాసుంది. మాకు ఆలోచించేంత సమయం ఇవ్వకుండా ఆ హౌస్ కథ అని వివరించాడు. అతను రక్త చరిత్ర రేంజ్ లో కథ చెప్తున్నా మాకు మాత్రం వినిపిస్తున్న సౌండ్ ఎఫెక్ట్స్‌కి చెమటలు పట్టేశాయి. ఒక్కసారిగా అరిచింది శ్రుతి. తన పక్కనే ఉన్న నా చేయి నలిపినంత పని చేసింది. ‘ఎ..ఎ... ఎముకల గూడు..’ వణుకుతూ అంది.ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి రైలు పెట్టెలులా ముందుకు కదిలాం. ఎదురుగా ఒక పెద్ద చెట్టు. దానిపై అస్థి పంజరాలు వేలాడుతున్నాయి. చెట్టు కింద ఒక ముసలివాడు పడుకుని మూలుగుతున్నాడు. మేము ముందుకు వెళ్లాలంటే అతన్ని దాటే వెళ్ళాలి. మా అందరిలోకల్లా కొద్దో గొప్పో ధైర్యం కొంచెం ఎక్కువున్న లచ్చి ముందుకు నడిచింది. అలా నడిచిందో లేదో, అతడు గబుక్కున లేచి కూర్చుని మంచంతో పాటు ముందుకు జరుగుతూ మమ్మల్ని అడ్డగించబోయాడు. నాకైతే పై ప్రాణం పైనే పోయినంత పనైంది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాం. లోపలికి వెళుతున్నకొద్దీ చీకటి మమ్మల్ని మంచుపొరలా కమ్మేసింది. తలో, ‘ఏయ్ వదులు... నా కాలు వదులు’ అంటూ హర్షిత కేక. తన కాలు ఎవరో పట్టుకున్నారు. భయంతో వాణ్ణి ఒక తన్ను తన్ని ఉరుకో ఉరుకు. అప్పటివరకు ఒకరినొకరం అంటి పెట్టుకునివున్న మేమంతా కూడా చెల్లా చెదురు అయిపోయాం. ఎక్కడ ఉన్నామో తెలియని అయోమయంలో ఉన్న నాకు, చేతికి ఏదో జుట్టులా తగిలేసరికి క్షణం పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మూసిన కళ్లు మూసినట్టే ఉన్నాయి. ఎటు కదలాలన్నా భయం. ధైర్యం కూడబలుక్కుని అక్కణ్ణుంచి పరుగులు తీశాను. చీకటిలో ఎటు వెళ్తున్నానో కూడా తెలియలేదు. ఎలాగోలా చివరకు ఒక తలుపు దగ్గరకు వచ్చాను. అది మూసి ఉంది. అంతలో, ఎక్కడ్నుంచి ఊడిపడ్డాడో, మర్రి ఊడల్లాంటి జడలతో ఒకడు భయపెడుతూ ఎదురొచ్చాడు. ఎటు వెళ్లాలో అర్థంకాక గట్టిగా కేకలు పెట్టాన్నేను. అంతలో వెనుక నుంచి సూపర్ వుమన్లా లచ్చి వాడిని ఒక్క ఉదుటున పట్టేసింది. వాడు వదిలించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. లచ్చి ఉడుం పట్టుకి వాడికి భయం వేసిందేమో...‘వదలవమ్మా తల్లే! నీకు దణ్ణం ఎడతా! నెక్ట్స్ బ్యాచ్ వచ్చేలోపు నే పోవాల. నా కొంప ముంచకు..’ అని గింజుకున్నాడు. ఒక్కసారిగా మమ్మల్ని కమ్మేసిన చీకటి పొరలు తొలగి వెలుతురు కనిపించింది. ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యిందని మాకు అర్థమయ్యేలోపు మేము స్కేరీ హౌస్ బయట వున్నాం. ఒక్కొక్కరుగా మా వాళ్ళందరూ బయటకి వచ్చారు. లచ్చి తన చేతిలో చింపిరి ఊడల జడ పట్టుకుని ఉంది.‘ఎక్కడ వాడు.. ఎక్కడ?’ అంటూ అటూ ఇటూ వెతికింది. దాన్ని అలా చూసి అందరం నవ్వాము. స్కేరీ హౌస్ బయట ఉన్నామని దానికి అర్థమవడానికి కొంత సమయం పట్టింది. లోపల జరిగింది మా వాళ్ళకి చెప్పా. అప్పటివరకు మాలో ఉన్న భయమంతా మా నవ్వులకి ఆవిరైపోయింది. లచ్చికి మేము పెట్టిన ‘జడల బొమ్మాళి’ అన్న పేరు, సోనీ కెమెరాలో బంధించిన ఆ క్షణాలు... ఎప్పుడు తలుచుకున్నా భలే నవ్వొస్తుంది. – సుచిత్రారెడ్డి -
ప్రసాద్ మల్టీఫ్లెక్స్కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రసాద్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లో ముఖ్యంగా లార్జ్‌స్క్రీన్ థియేటర్లో సీట్ల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా ఉందంటూ అందిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు.. చట్ట నిబంధనల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం, పురపాలక, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీ, జిల్లా కలెక్టర్, జిల్లా అగ్నిమాపక అధికారితో పాటు ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లోని లార్జ్‌స్క్రీన్ థియేటర్లో 14 వరుసల్లో 630 సీట్లు ఉన్నాయని, సీట్ల మధ్య నుంచి బయటకొచ్చే వెసులుబాటు ఎక్కడా లేదని, ఇది అత్యవసర సమయాల్లో అనేక ప్రమాదాలకు దారి తీస్తుందంటూ సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. -
ఉత్త రిలీజులు
మే 1వ తేదీ... శుక్రవారం. ఉదయం 8.30 గంటలు... హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ-మ్యాక్స్ ప్రాంగణం... గుంపులుగా జనం... హీరో కమల్‌హాసన్ ‘ఉత్తమ విలన్’ను చూడడానికి ఉదయాన్నే సిద్ధమై వచ్చిన జనం... తమిళనాట వసూళ్ళ వర్షం కురిపిస్తూ... తెలుగులోకి లేట్ రిలీజైన లారెన్స్ ‘గంగ’ చూడాలని ఆసక్తిగా వచ్చిన ఆడియన్స్! తెలుగువాళ్ళు... తమిళులు... మలయాళీలు... భాషాభేదాలు లేకుండా సినిమా ఏకం చేసిన దాదాపు వెయ్యిమంది! ఎవరికి వారు పక్కవాళ్ళను విషయం అడుగుతూ, ఫోనుల్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. ‘సినిమా రాలేదట!’... ‘పడం వరలా’... ‘ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్!’... లాంగ్వేజ్ ఏదైనా డిస్కషన్ ఒకటే! ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని వచ్చినా, రీళ్ళ బాక్సులు (ఇప్పుడన్నీ డిజిటల్ ప్రింట్లే కాబట్టి, డిజిటల్ కోడ్లు) రాలేదని నిరుత్సాహం! ఒక్క హైదరాబాద్‌లోనే కాదు... తెలుగునేల అంతటా ఆ రోజు మధ్యాహ్నానికి కానీ, తెరపై ‘గంగ’ బొమ్మ పడలేదు. తెలుగుతో పాటు తమిళనేల మీదా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొన్న ‘ఉత్తమ విలన్’ అయితే శనివారం మధ్యాహ్నం తరువాత కానీ, ప్రేక్షకుల్ని పలకరించలేదు. ఇన్ని కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాలు... అదీ పేరున్న పెద్దవాళ్ళ సినిమాలు కూడా ఆఖరు క్షణంలో రిలీజ్ ఎందుకు ఆగినట్లు? సినిమాలు బాగున్నా - ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే...? సినిమా కష్టాలు... సినిమా రిలీజ్‌కు ముందు సవాలక్ష కష్టాలు... పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్‌కు తగ్గట్లు బిజినెస్ జరగడం లేదు! ఫలానా ఏరియాను ఫలానా మొత్తానికి కొంటామన్న బయ్యర్లు ఆఖరు క్షణంలో... అనుకున్న మొత్తం కన్నా తక్కువ డబ్బే తెస్తున్నారు! తమకు చెల్లించాల్సిన పాత ఫ్లాప్ సినిమాల అప్పుల సంగతేంటో తేల్చమంటూ నిర్మాతల మీద పడే ఫైనాన్షియర్లు! వెరసి ఒక సినిమా ఎంత ఖర్చుతో తీస్తున్నామనే దాని కన్నా, ఎంత సులువుగా రిలీజ్ చేసుకుంటామనేది సమస్యగా మారింది. ఈ కష్టాల కథేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా సినీ వ్యాపారం ఏమిటో తెలుసుకోవాలి. అది ఏమిటంటే... గతంలో సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన - ఈ మూడు సెక్టార్ల కలెక్టివ్ రెస్పాన్స్‌బిలిటీ. సినిమా అంటే నిర్మాత, దర్శకుడు ఒక కథ అనుకొని, ప్రయత్నాలు మొదలుపెట్టేవారు. నిర్మాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాడు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లే కింగ్ మేకర్లు. చిత్ర నిర్మాణానికి డబ్బు వాళ్ళ నుంచి అందేది. ఆ మనీతో సినిమా తయారయ్యేది. పంపి ణీకి డిస్ట్రిబ్యూటర్లు... అద్దె లేదా నెట్ కలెక్షన్లలో పర్సంటేజ్ మీద తమ హాలులో సినిమా వేయడానికి ఎగ్జిబిటర్లు రెడీ. కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతల మధ్య పంపిణీ అయ్యేది. సినిమా ఆడక తేడా వస్తే, అప్పటికి ఆ నష్టం డిస్ట్రిబ్యూటర్ భరించేవాడు. సదరు దర్శక, నిర్మాతల తరువాతి సినిమాలో ఎడ్జస్ట్ చేసేవాడు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. రిలీజ్ ముందు నిద్ర లేని రాత్రులు! డిస్ట్రిబ్యూటర్ల సిస్టమ్ పోయి, బయ్యర్లు వచ్చాక రిస్క్ ఫ్యాక్టరూ పెరిగింది. నిర్మాతలు క్రేజీ కాంబినేషన్స్ మాత్రం సెట్ చేసుకొంటారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో సినిమా స్టార్ట్ చేస్తారు. పదుల కోట్లు ఫైనాన్షియర్స్ నుంచి వడ్డీకి తెస్తారు. సినిమా సిద్ధమయ్యేవేళలో బయ్యర్లు క్రేజీ ఆఫర్లతో వస్తారు. కానీ, సినిమా కాస్త తేడాగా ఉందని ఏ మాత్రం ఉప్పందినా... వెంటనే ప్లేటు ఫిరాయిస్తారు. అనుకున్న దాని కన్నా తక్కువ రేటే ఇస్తారు. ఫలితం - నిర్మాతకు ఆశించిన బిజినెస్ కావడం లేదు. ఇప్పటికి ఈ సినిమా వరకు ప్రాఫిట్‌కే అమ్మినా, గత సినిమాలపై పేరుకున్న అప్పులు నిర్మాతను భూతంలా వెంటాడి వేధిస్త్తుంటాయి. ఉదాహరణకు, ఒక నవ యువ సామ్రాట్ మూడక్షరాల సినిమా ఏప్రిల్ చివరి వారంలో రూ. 10 కోట్ల దాకా బిజినెస్ కావాల్సింది. లాస్ట్‌మినిట్‌లో బయ్యర్లు 25 శాతం తగ్గించి, కట్టారు. వ్యాపారం తగ్గినా, నిర్మాత విధి లేక సినిమా రిలీజ్ చేశారు. ఇక, గత చిత్రాల లాస్‌లు తడిసి మోపెడై, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ను ‘గంగ’ రిలీజ్లో ఇబ్బంది పెట్టాయి. ‘ఉత్తమ విలన్’ను సమర్పిస్తున్న తిరుపతి బ్రదర్స్‌కు పాత ఫ్లాప్ ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) తాలూకు అప్పులు ఇప్పుడడ్డుపడ్డాయి. ‘‘అక్కడెవరో తీసిన సినిమాను ఇక్కడ నుంచి వెళ్ళి ఎగబడి కొంటున్నప్పుడు, వాళ్ళకున్న పాత అప్పులేంటో మనకు తెలీదుగా! చివరకు మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని, తమిళ, తెలుగు వెర్షన్ల నిర్మాతలు, సినీ సంఘాలు శ్రమిస్తే కానీ ‘ఉత్తమ విలన్’ ఒకటిన్నర రోజులు ఆలస్యంగా మన దేశంలో విడుదల కాలేకపోయింది’’ అని ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. నిజానికి, ఇలా ఒక పెద్ద సినిమా రిలీజ్ ఒక్క రోజు ఆలస్యమైనా ఆ సినిమాకొచ్చే మొత్తం రెవెన్యూలో 20 నుంచి 25 శాతం మేర నష్టపోవాల్సి వస్తుంది. ఇక, ఆ రోజున సినిమా థియేటర్లో సైకిల్ స్టాండ్ మొదలు ఇతర అనుబంధ వ్యాపారాలకు కలిగే లాస్ దీనికి అదనం. నిజానికి, ఇది ఒక రోజుకో... ఒక సినిమాకో... పరిమితమైన సమస్య కాదు. కలెక్షన్స్‌లో ఇండస్ట్రీ హిట్ పవన్‌కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లాంటి బడా సినిమాల మొదలు ఛోటా నటుల చిన్న సినిమాల దాకా ఇదే పరిస్థితి. సినిమాల రిలీజ్ ముందు రోజు రాత్రి ల్యాబుల్లో, స్టార్ హోటళ్లలో ప్రైవేట్ ‘పంచాయతీ’లు మామూలే. కాకపోతే, కొన్ని బయటకొస్తాయి. చాలా మటుకు సినీ వ్యాపార వర్గాల ‘రహస్యాలు’గా మిగిలిపోతాయి. ‘‘ఇవాళ రెమ్యూనరేషన్స్‌తో సహా నిర్మాణవ్యయం 40 శాతం పెరిగింది. అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల పర్చేజింగ్ పవర్ 30 నుంచి 40 శాతం తగ్గింది. వెరసి సినిమా వ్యాపారానికి 70 - 80 శాతం బొక్క పడింది’’ అని గుంటూరు డిస్ట్రిబ్యూటర్, చిత్ర నిర్మాణంలో అనుభవమున్న కొమ్మినేని వెంకటేశ్వరరావు వివరించారు. ఇలా కాస్ట్ పెరిగి, బిజినెస్ తగ్గి, పాత అప్పుల భారం తీరే మార్గంలేక, నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. సినిమాల రిలీజ్లు లాస్ట్‌మినిట్‌లో లేట్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి ఇప్పుడో హిట్ కావాలి! కోట్ల ఖర్చుతో సినిమా తీసిన నిర్మాత... కోట్లు పారితోషికం తీసుకొనే హీరో... తెర ముందు కనిపించే షో ఇది. ఈ షోకు తెర వెనుక ఆర్థిక సూత్రధారులుగా ఫైనాన్షియర్లు, బయ్యర్లు, వీళ్ళకు డబ్బులు సమీకరించే ఎగ్జిబిటర్లు... సినిమా బిజినెస్ గ్లామర్ దీపం చుట్టూ శలభాలు. గత అయిదు నెలలుగా అన్నీ నష్టాలవడంతో బయ్యర్ల మొదలు ఫైనాన్షియర్స్ దాకా ఎవరికీ ఇప్పుడు చేతిలో డబ్బు ఆడని పరిస్థితి. ‘‘తక్షణమే కనీసం ఒక్క పెద్ద హిట్ రావాలి. అప్పుడు కానీ, డబ్బులు పెట్టే ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ఈ ఫైనాన్షియల్ స్లంప్ నుంచి తేరుకోలేరు’’ అని ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘లయన్’ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు అన్నారు. ‘‘మన దగ్గర రిలీజ్ ప్లానింగ్ లేదు. బయ్యర్ల నుంచి వస్తున్నదెంత, ఫైనాన్షియర్లకు తీర్చాల్సిన అప్పుల రూపంలో పోయేదెంత అనే లెక్క చూసుకోవడం లేదు. ఇవన్నీ సరిదిద్దుకోవాలి. నిర్మాతలంతా కూర్చొని, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి’’ అని సునీల్ నారంగ్ సూచించారు. అవును... అది నిజం. ఒకప్పుడు సినిమా... కేవలం కళ! ఆ తరువాత.... కళాత్మక వ్యాపారం! మరి ఇప్పుడు కాసుల చుట్టూ తిరిగే వ్యాపార కళ!! ఈ పరిస్థితుల్లో సినిమా బిజినెస్ ప్రతి వారం టేబుల్స్ టర్న్ చేసే చిత్రమైన ‘ధందా’! ఈ వ్యాపారంలో ఆర్థిక కష్టాలను తట్టుకొని, హాలులోని జనం దాకా సినిమా రావడం... ప్రతి శుక్రవారం ఒక సెల్యులాయిడ్ సిజేరియన్ డెలివరీ! - రెంటాల జయదేవ నష్టాల్లో... అయిదు నెలలు ‘డిసెంబర్ నుంచి ఈ 5 నెలల్లో తెలుగులో వచ్చిన సినిమాల్లో నికరంగా డబ్బులు చేసుకున్నది ఒక్కటీ లేదు. కల్యాణ్‌రామ్ ‘పటాస్’ ఒక్కటే రీజనబుల్‌గా పే చేసింది. పెద్ద స్టార్ల ‘లింగ’, ‘గోపాల గోపాల’ నుంచి లేటెస్ట్ సమ్మర్ రిలీజ్‌ల దాకా అన్నీ లాసే. బయ్యర్లను పోటు పొడిచినవే.’’ - సుధాకర్ నాయుడు, ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్ అధినేత - బయ్యర్, కర్నూలు ‘‘తమిళనాట ఎవరో తీస్తున్న సినిమాను మనం ఎగబడి వెళ్ళి కొనుక్కోవడంలో ఎంత ఇబ్బంది ఉందో అర్థమైంది. అక్కడ వాళ్ళకున్న అప్పులేమిటో తెలియదుగా! 53 సినిమాలు నిర్మించినా రిలీజ్ డేట్ నాడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు 54వ సినిమా ‘ఉత్తమ విలన్’కు తొలిసారి అది నాకు అనుభవమైంది.’’ - సి. కల్యాణ్ ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేటెస్టయినా లేట్‌గా వచ్చిన కొన్ని! శంకర్ - విక్రమ్‌ల ‘ఐ’ నాని నటించిన ‘జెండా పై కపిరాజు’ వై.వి.ఎస్. - సాయిధరమ్ తేజ్‌ల ‘రేయ్’ కమలహాసన్ ‘ఉత్తమ విలన్’ లారెన్స్ ‘గంగ’ షూటింగ్ ఫినిష్! రిలీజ్‌కే వెయిటింగ్!! నితిన్ ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ కమల్ దర్శకత్వంలోని ‘విశ్వరూపమ్ 2’ రాజశేఖర్ నటించిన ‘వందకు వంద’ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ‘పట్టపగలు’ ....................................................................... సెన్సారైంది..! రిలీజ్ ఆగింది! విజయశాంతి నటించిన ‘శివాని’ రాఘవేంద్రరావు ‘ఇంటింటా అన్నమయ్య’