ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 సినిమా అనేక రికార్డ్‌లను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కు భారీగా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ చిత్రం సుమారు రూ.1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, సినిమా ప్రీమియర్స్ సమయంలో రేవతి చనిపోవడంతో చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. పుష్ప సినిమా బన్నీకి ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అంతే స్థాయిలో తనని ఇబ్బంది పెట్టే సంఘటనలు జరిగాయి. అయితే, ఈ చిత్రం వల్ల ఒక గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఒక మల్టీఫ్లెక్స్ థియేటర్‌లోకి అర్ధరాత్రి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో 'పుష్ప-2' సినిమా ప్రదర్శన కొనసాగుతుండగా వారి ఎంట్రీ జరగడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి కొంత సమయం పాటు సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకులతో పాటు సాధారణ వ్యక్తిలా కూర్చొని ఉన్న డ్రగ్స్ స్మగ్లర్, పలు హత్య కేసులలో నిందితుడిగా ఉన్న విశాల్ మిశ్రాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనను చూసిని వారందరూ కూడా షాక్ అయ్యారు. అతని అరెస్ట్ తర్వాత సినిమా ప్రదర్శన కొనసాగింది. సుమారు ఏడాది పాటు పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
అయితే, పుష్ప2 సినిమాపై విశాల్ మిశ్రాకు ఉన్న ఆసక్తిని పోలీసులు గుర్తించారు. ఎలాగైన అతను సినిమా చూసేందుకు వస్తాడని పోలీసులు ముందుగానే అంచనా వేసి నిఘా ఉంచారు. అయితే, అతను పుష్ప2 విడుదల సమయంలో కాకుండా తాజాగా థియేటర్‌కు వెళ్తున్నట్లు పాంచ్‌పావలీ పోలీస్‌స్టేషను అధికారికి సమాచారం అందింది. అతను ఏ థియేటర్‌లో సినిమా చూడనున్నాడు, సీటు నంబర్‌తో సహా వారికి సమాచారం రావడంతో పక్కా ప్లాన్‌తో పోలీసలు ఎంట్రీ ఇచ్చారు. విశాల్ మిశ్రాపై ఇప్పటికే రెండు హత్యలు, డ్రగ్స్ రవాణా వంటి వాటితో పాటు మొత్తం 30కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment