
కోలీవుడ్ నుంచి మళ్లీ కబురు అందుకున్నారు రాశీ ఖన్నా. ఇప్పటికే తమిళంలో అరడజను చిత్రాలకు పైగా చేసిన ఈ బ్యూటీ తాజాగా హీరో జీవా సరసన నటించనున్నారని టాక్. దర్శకుడు పా. విజయ్ తెరకెక్కించనున్న సినిమాలో జీవా హీరోగా, ప్రధాన పాత్రలో అర్జున్ నటించనున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలోనే రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించనున్నారని తెలిసింది. ‘‘జీవా, అర్జున్‌గార్ల కాంబినేషన్‌లో గతంలో నేను ఓ సినిమా ప్లాన్ చేశాను. కానీ కుదర్లేదు. ఇప్పుడు నా కొత్త సినిమాకు ఈ ఇద్దరూ ఓకే కావడం హ్యాపీగా ఉంది. మా సినిమా కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో సెట్ వేస్తున్నాం.
సెట్ పూర్తి కాగానే షూటింగ్ ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఊటీ, కొడైకెనాల్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశాం’’ అని పేర్కొన్నారు పా. విజయ్. అయితే రాశీ ఖన్నా విషయంపై విజయ్ క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment