Ram Charan And Upasana Take Off To Dubai For An Exquisite Vacation, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Charan And Upasana: దుబాయ్‌లో వాలిపోయిన చెర్రీ-ఉపాసన.. సోషల్ మీడియాలో వైరల్

Mar 29 2023 7:25 PM | Updated on Mar 29 2023 7:54 PM

Ram Charan and Upasana take off to Dubai for an exquisite vacation  - Sakshi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రంలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే చరణ్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. రామ్ చరణ్ బర్త్‌ డే వేడుకలను మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు, ఆర్ఆర్ఆర్ చిత్రబృందం పాల్గొని సందడి చేశారు. బర్త్ డే ఫంక్షన్‌లో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తొలిసారిగా బేబీ బంప్‌లో కనిపించింది. త్వరలోనే చెర్రీ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే రామ్ చరణ్ తాజాగా తన భార్య ఉపాసనతో కలిసి వేకేషన్‌కు వెళ్లారు. తన బర్త్‌ డే వేడుకల అనంతరం దుబాయ్‌లో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రైవేట్ జెట్‌లో దుబాయ్ వెళ్తున్న ఓ వీడియోను ఆమె పంచుకుంది. విమానంలో రామ్ చరణ్ తన పెంపుడు కుక్కను కూర్చొబెట్టుకుని ఉన్న ఫోటో తెగ వైరలవుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement