
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకి లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. నిరు పేదలు మొదలు.. సీనీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను సైతం ఈ మహ్మారి వదలడంలేదు. కోవిడ్ దెబ్బకి టాలీవుడ్ ప్రముఖులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే చాలామంది టాలీవుడ్ ప్రముఖులను కరోనా మహమ్మారి బలి తీసుకుంది. తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాం కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన జయరాం.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారట. త్వరలోనే చరణ్ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోబోతున్నారని సమాచారం. కాగా గతంలో ఒకసారి చరణ్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆ విషయాన్ని స్వయంగా కళ్యాణ్ దేవ్ ప్రకటించాడు. కళ్యాణ్ దేవ్ తో పాటు ఆయన సన్నిహితుడికి కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొన్న సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. మొత్తానికి కరోనా వల్ల మెగా ఫ్యామిలీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కరోనా సోకడంతో ... ఆయన కూడా ఇప్పుడు ఐసోలేషన్ లో ఉన్నారు.
చదవండి:
ఆసుపత్రిలో చేరిన చిరంజీవి అల్లుడు
Comments
Please login to add a commentAdd a comment