
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సాధారణంగా ఎవరినీ మెచ్చుకోడు, ఎవరో కొందరు హీరోయిన్లను తప్ప! రాజకీయ నాయకులు, ప్రముఖ సెలబ్రిటీలనైతే అసలు ఖాతరు చేయడు. వీలు దొరికితే చాలు వారి మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటాడు. అంతెందుకు వారి జీవితకథలను కూడా సినిమాలుగా తీశాడు.
అయితే తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్‌ను వర్మ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ధాకడ్ చిత్రీకరణలో పాల్గొంటున్న కంగనా రనౌత్ చేతిలో పొడవాటి తుపాకీ పట్టుకుని ముఖాన రక్తంతో యాక్షన్ సీన్‌లో పూర్తిగా ఇన్వాల్ అయి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఆమె హార్డ్ వర్క్ ఫొటోలో ప్రస్ఫుటంగా కనిపిస్తుండగా చాలామంది ఆమె పనితనాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆర్జీవీ కూడా ఈ ఫొటో చూసి స్పందించకుండా ఉండలేకపోయాడు. నా సినీ కెరీర్‌లో నేను చూసిన బెస్ట్ క్లోజ్‌అప్ ఫొటో ఇది. పాత్రలో ఈ రేంజ్‌లో లీనమైన నటి ఎవరైనా ఉన్నారా? అంటే అసలు ఒక్కరు కూడా గుర్తుకు రావడం లేదు. నీలాంటి నటిని ఇదివరకెన్నడూ చూడలేదు. హే కంగనా నువ్వో న్యూక్లియర్ బాంబ్ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అయితే ఏమైందో ఏమో కానీ వెంటనే సదరు ట్వీట్‌ను తొలగించాడు. కాగా కంగనా ప్రస్తుతం యాక్షన్ ప్యాక్‌డ్ ధాకడ్ షూటింగ్‌లో బిజీగా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment