Ram Gopal Varma Review On Vijay Deverakonda Liger Movie - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: విజయ్‌ దేవరకొండను ఆకాశానికెత్తిన ఆర్జీవీ

Published Mon, Jul 19 2021 8:23 PM | Last Updated on Tue, Jul 20 2021 12:44 PM

Ram Gopal Varma Tweet About Vijay Devarakonda In Liger Movie - Sakshi

Ram Gopal Varma Tweet On Vijay Devarakonda: రామ్‌గోపాల్‌ వర్మ.. ఆయన రూటే సెపరేటు. 'శివ' సినిమాతో సైకిల్‌ చైన్‌ లాగి టాలీవుడ్‌లో ట్రెండ్‌ చేసిన ఈ డైరెక్టర్‌ గత కొంతకాలంగా వివాదాలు, విమర్శలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న ఈయన ఇప్పుడు ఏం సినిమాలు తీస్తున్నాడో, ఎందుకు తీస్తున్నాడో కూడా తెలియని స్థితి దాపురించింది. ఇదిలా వుంటే తాజాగా ఆర్జీవీ ఓ తెలుగు హీరోను ఆకాశానికెత్తాడు. స్క్రీన్‌ మీద అతడి లుక్‌ స్టార్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోదని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశాడు. ఇంతకీ ఆయనతో ఓ రేంజ్‌లో ప్రశంసలందుకుంటున్న హీరో ఎవరనుకుంటున్నారు? అతడే మన రౌడీ విజయ్‌ దేవరకొండ. 

"లైగర్‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ గత రెండు దశాబ్దాల్లో వచ్చిన స్టార్‌ హీరోల కంటే అద్భుతంగా ఉంది. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌లకు ధన్యవాదాలు" అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. లైగర్‌లోని కొన్ని సన్నివేశాలు చూసిన కాసేపటికే ఆయన ఈ కామెంట్లు చేయడంతో రౌడీ ఫ్యాన్స్‌ తెగ ఎగ్జైట్‌ అవుతున్నారు. లైగర్‌లో మరో కొత్త విజయ్‌ను చూడబోతున్నామా? అని ఆతృతగా సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కొందరు మాత్రం కావాలని విజయ్‌ను ప్రమోట్‌ చేస్తున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement