టాలీవుడ్ టాప్ స్టార్స్ పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టారు. యంగ్ హీరోస్ మేమేం తక్కువ కాదంటూ కోలీవుడ్ పై ఫోకస్ పెడుతున్నారు. టాలీవుడ్ తర్వాత అతి పెద్ద మార్కెట్ అయిన తమిళ సినీ పరిశ్రమను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే తెలుగులో నటించిన సినిమాలు తమిళంలో విడుదల చేస్తున్నారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కోలీవుడ్ మార్కెట్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు.ఇప్పటికే అక్కడి దర్శకుడు లింగుస్వామితో కలసి ది వారియర్ మూవీలో నటించాడు.జులై 14న ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది.ఈ మూవీ తర్వాత బోయపాటితో ఊరమాస్ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు రామ్.ఈ సినిమాతో పాటే ఇప్పుడు మరో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ మేకింగ్ లోనూ తెలుగు, తమిళ చిత్రం చేయాలనుకుంటున్నాడు.
లవ్ స్టోరీస్‌ను, పోలీస్ కథలను డీల్ చేయడంలో గౌతమ్కు మంచి పట్టుంది. ఇప్పుడు ఎక్స్ పీరియెన్స్ తో రామ్ కోలీవుడ్ లో తన మార్కెట్ ను మరింత విస్తరించాలనుకుంటున్నాడు. గౌతమ్ మీనన్ ఇప్పటికే రామ్ కోసం కథను కూడా రెడీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు హీరో నాని కూడా తాను నటించిన చిత్రాలన్ని తమిళ్ రిలీజ్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన శ్యామ్ సింగర్, అంటే సుందరానికి చిత్రాలు అక్కడ విడుదలయ్యాయి. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘దసరా’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది.
మరో యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా తమిళ సినీ పరిశ్రమపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే వెంకట్ ప్రభుతో మూవీ కమిట్ అయ్యాడు. ఈ మధ్యే ఈ ప్రాజెక్ట్ ను ఘనంగా ప్రారంభించారు. రానున్న రోజుల్లో చై కూడా రామ్ దారిలో తమిళ దర్శకులతో ఎక్కువ సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment