
దళపతి విజయ్, నేషనల్ క్రష్ రష్మిక హీరోహీరోయిన్‌గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న చిత్రం వారిసు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే తమిళ్‌లో రంజితమే అనే పాట విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. ఇక తెలుగులో కూడా ఈ పాటను విడుదల చేశారు. తమన్ సంగీతం అంధించిన ఈ పాట తెలుగు వెర్షన్ బుధవారం విడుదలైంది. ‘రంజితమే’అంటూ సాగే ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, ఎం ఎం మానసి ఆలపించారు. తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment