నేషనల్ క్రష్, కన్నడ భామ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది. పార్ట్-1లో శ్రీవల్లిగా మెప్పించిన పుష్ప-2లోనూ టాలీవుడ్ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు.
అయితే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన సరసన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన డియర్ కామ్రేడ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్‌ను అలరించలేకపోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో 2019లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.
తాజాగా ఈ మూవీ రిలీజై ఐదేళ్లు పూర్తి కావడంతో రష్మిక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆ జ్ఞాపకాలు మరిచిపోలేనివని తెలిపింది. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా.. ఇప్పటికీ నన్ను లిల్లీ అని పిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. క్రికెట్ ట్రైనింగ్‌లో నెలల తరబడి గాయాల బారిన పడ్డామని ఆ రోజులను గుర్తు చేసుకుంది. అయితే షూటింగ్ రోజు కన్నీళ్లు, నవ్వులు, చెమటతో ఇచ్చిన సంతృప్తి తమ కష్టాన్ని మరిచిపోయేలా చేసిందన్నారు. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైందని రష్మిక పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment