Rashmika Mandanna Praises Allu Arjun In Tirupati Pushpa Movie Success Meet- Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: అల్లు అర్జున్‌పై రష్మిక షాకింగ్‌ కామెంట్స్‌

Published Wed, Dec 22 2021 11:41 AM | Last Updated on Wed, Dec 22 2021 12:55 PM

Rashmika Mandanna Praises Allu Arjun In Tirupati Pushpa Movie Success Meet - Sakshi

Rashmika Mandanna Praises Allu Arjun In Pushpa Movie Success Meet: పుష్ప’ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో  హీరోహీరోయిన్‌తో పాటు మూవీ టీం సెక్సెస్‌ మీట్స్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న(మంగళవారం) తిరుపతిలో జరిగిన సక్సెస్‌ మీట్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ రష్మిక మందన్నా, డైరెక్టర్‌ సుకుమార్‌, మ్యాజిక్‌ డైరెక్టర్‌ సుకుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మిక స్టేజ్‌పై మాట్లాడుతూ బన్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో అ‍్లలు అర్జున్ పుష్పగా ఇరగదీశాడని, నెక్ట్‌ అవార్డు ఫంక్షన్లో నేషనల్‌ అవార్డుతో సహా అన్ని బన్నీకే రావాలంటూ బన్నీని పొగడ్తలతో ముంచెత్తింది.

చదవండి: క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!

అంతేగాక పుష్పలో బన్నీ బాగున్నాడా? ఇప్పుడు ఈ బన్నీ బాగున్నాడా? అని హోస్ట్‌ రష్మికను అడగ్గా.. నా పుష్పనే బాగున్నాడంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అలాగే ‘అల్లు అర్జున్ సార్ నేను మీకు ఫ్యాన్‌ని మాత్రమే కాదు.. అంతకుమించి. ఈ సినిమాలో మీరు ఎంతో అద్భుతంగా నటించారు. స్క్రీన్ పై మీ ఎనర్జీ చూస్తుంటే మాటలు రావడం లేదు. కచ్చితంగా ఈ ఏడాది నేషనల్ అవార్డుతో పాటు అన్ని అవార్డులు మీకు రావాలనే కోరుకుంటున్నాను.

చదవండి: బేబీ బంప్‌తో స్టార్‌ హీరోయిన్‌.. పట్టేసిన నెటిజన్లు, ఫొటోలు వైరల్‌

అలా రాకపోతే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను’ అంటూ వ్యాఖ్యానించింది. అలాగే ‘సుకుమార్ గారు డైరెక్షన్‌ చింపేశారు. ఇక దేవిశ్రీ గారి పాటలు ఈ సినిమాకి హైలైట్. ప్రతి పాట అదిరిపోయింది. ఆయన పాటల వలన మాకు దిష్టి తగులుతుందేమోనని అనిపిస్తోంది. అందుకే నేను దిష్టి తీసుకుంటున్నాను. ఇక ఏ సినిమా ఇంత గొప్పగా రావడానికి మైత్రీ మూవీస్ వారు కారకులు. వాళ్లకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను" అంటూ ముగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement