ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పార్ట్ వన్ ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ కథపై హీరోయిన్ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రష్మిక మాట్లాడుతూ.. ‘పుష్ప’ కథ పూర్తిగా తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
చదవండి: ‘పుష్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘటనపై రష్మిక ఆవేదన
ఈ మేరకు రష్మిక ‘‘పుష్ప’ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అని అంతా అడుగుతున్నారు. అసలు నాకు సుకుమార్ గారు పూర్తి కథ చెబితేనే గదా. ఆయన నా పాత్ర ప్రాధాన్యతను గురించి చెప్పారే తప్ప పూర్తి కథను చెప్పలేదు. ఆయన పట్ల గల నమ్మకంతో నేను ఒకే చెప్పేశాను. అయితే షూటింగు జరుగుతున్నప్పుడు నా పాత్ర విషయంలో నాకు సంతృప్తి పెరుగుతూ వెళ్లిందే తప్ప తగ్గలేదు. నా పాత్రకి మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం బలపడుతూ వెళ్లింది. ఫస్టు పార్టు పూర్తవుతోందంటే బాధగా అనిపించింది. రెండవ భాగం ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: నుదిటిన సింధూరం.. తాలిబొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment