
RaviTeja: కథ నచ్చాలే కానీ.. కొత్త దర్శకులకు చాన్స్‌లు ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే ఆయన చాలా మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇటీవల క్రాక్ సినిమా విజయం తర్వాత రవితేజ స్పీడ్ పెంచాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతోపాటు శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటన ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజను ఇంతవరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో చూపించబోతున్నాడట దర్శకుడు.
ఇందులో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 1 నుంచి హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో టీమ్ అందరూ పాల్గొననున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
చదవండి:
ఆచార్యకు ప్యాకప్.. చివరి షెడ్యూల్ అప్పుడే
Comments
Please login to add a commentAdd a comment