
‘ఖిలాడి’ స్పీడ్‌కు కరోనా బ్రేక్ వేసింది. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఖిలాడి’. ఇందులో డింపుల్ హయతి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఇటలీలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఇటలీ షెడ్యూల్ దాదాపు పూర్తయ్యే తరుణంలో చిత్రయూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది.
ఇటలీలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం ‘ఖిలాడి’ సినిమా షూటింగ్‌కు అనుమతులను నిలిపివేసిందట. దాంతో చిత్రబృందం అయోమయంలో పడిందని సమాచారం. కొన్ని రోజులు అక్కడే ఉండి షూటింగ్‌ను పూర్తి చేసుకుని వస్తారా? లేక మిగిలిన షూటింగ్‌ను ఇక్కడి లొకేషన్స్‌లో ముగించే ప్లాన్ వేసుకుంటారా? అనేది చూడాలి. ఈ సినిమాను మే 28న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment