గాఢీ ఎక్కిన ‘ఖిలాడి’, రయ్‌ రయ్‌మంటూ రవితేజ పరుగులు | Ravi Teja Khiladi Movie Shoots To Resume 26th July | Sakshi
Sakshi News home page

గాఢీ ఎక్కిన ‘ఖిలాడి’, రయ్‌ రయ్‌మంటూ రవితేజ పరుగులు

Published Sun, Jul 25 2021 8:04 AM | Last Updated on Sun, Jul 25 2021 8:04 AM

Ravi Teja Khiladi Movie Shoots To Resume 26th July - Sakshi

హీరో రవితేజ, దర్శకుడు రమేశ్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఖిలాడి: ప్లే స్మార్ట్‌’. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. ఇప్పటికే ఎక్కువ శాతం షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ సోమవారం ఆరంభం కానుంది. ఈ సందర్భంగా ‘ఖిలాడి’లో ద్విచక్ర వాహనం మీద రయ్‌ రయ్‌మంటూ రవితేజ వెళుతున్న కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. జయంతీ లాల్‌ గడ సమర్పణలో కోనేరు సత్యానారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మేలో విడుదల కావాల్సింది. కోవిడ్‌ కారణంగా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement